ఆరోగ్య దారిలోకి వచ్చేయండి!

వినాయక చవితి నుంచి వరుసగా పండగలే! రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ప్రతిదాన్నీ అందరం తనివితీరా చేసుకున్నాం. నచ్చిన పిండి వంటల్నీ ఆస్వాదించేశాం. పండగలు ముగిశాయి. ఎంత బరువు పెరిగారో చూసుకున్నారా? తిరిగి ఆరోగ్యంపై దృష్టి పెట్టేదామా మరి!

Published : 28 Oct 2022 00:34 IST

వినాయక చవితి నుంచి వరుసగా పండగలే! రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ప్రతిదాన్నీ అందరం తనివితీరా చేసుకున్నాం. నచ్చిన పిండి వంటల్నీ ఆస్వాదించేశాం. పండగలు ముగిశాయి. ఎంత బరువు పెరిగారో చూసుకున్నారా? తిరిగి ఆరోగ్యంపై దృష్టి పెట్టేదామా మరి!

* స్వీట్లు, పిండివంటలు, ఆహారం.. ప్రతిదీ కెలోరీలతో నిండిపోయిందే! శరీరంలోకి చేరిన వాటిని తగ్గించాలంటే తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. కూరగాయల కిచిడి, ఉప్మాలను ఎక్కువగా తీసుకోండి. పాలకూర, క్యాబేజీలను తరచూ తీసుకుంటే మంచిది. కొద్ది రోజులు బయటి ఆహారం, నూనె పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

* చక్కెరలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తీపి తినాలనుకుంటే సహజ ప్రత్యామ్నాయాలు.. బెల్లం, తేనె, ఖర్జూరాలను ఎంచుకోండి. నోటికీ రుచి, కెలోరీలు తక్కువ.. ఆరోగ్యం కూడా.

* రోజుకు 2-3 లీటర్లు మంచినీటిని తాగండి. శరీరంలో మలినాలు బయటకు పోతాయి. నీటిలో కీర, పుదీనాగానీ నిమ్మ, తేనె, ఖర్జూర కలిపి లేదా జీలకర్ర వేసి ఉంచైనా తాగొచ్చు. శరీరం డీటాక్స్‌ అవ్వడమే కాదు.. కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లూ అందుతాయి. ఫ్రూట్‌, గ్రీన్‌ టీ, అల్లం వేసి మరిగించిన నీళ్లు తీసుకున్నా మంచిదే. ఇవి పొట్టలో ఇన్ఫెక్షన్లను తగ్గించడంతోపాటు రోగ నిరోధకతనీ పెంచుతాయి.

* తాజా పండ్లకీ రోజువారీ ఆహారంలో చోటివ్వాలి. విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే వీటిలో ఫైబర్‌ కూడా ఎక్కువే. తేలిగ్గా అరగడమే కాకుండా శరీరాన్ని లోపల్నుంచి శుభ్రం చేయడంలోనూ సాయపడతాయి.

* రోజూ వ్యాయామం తప్పని సరి చేసుకోండి. పావుగంట నడక, యోగా, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లూ కెలోరీలను తగ్గించి శరీరాన్ని తేలికగా మారుస్తాయి. అయితే దాన్ని కొనసాగించడం ప్రధానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్