నా గుండెకు మరో ఆరు శస్త్రచికిత్సలు..

కాలేజీలో చదువుతున్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యా. ఆ కారును చూసిన వారెవరూ నేను బతికి ఉంటానని అనుకోరు. తీవ్ర గాయాలు... ముఖమంతా కాలింది.

Published : 29 Oct 2022 01:11 IST

అనుభవ పాఠాలు

కాలేజీలో చదువుతున్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యా. ఆ కారును చూసిన వారెవరూ నేను బతికి ఉంటానని అనుకోరు. తీవ్ర గాయాలు... ముఖమంతా కాలింది. ఏడిస్తే కన్నీళ్లకు ముఖమంతా మండి పోయేది. అది భరించలేక, ఏడవడం మానేశా. కొన్ని నెలలు అద్దంలో చూసుకోవడానికే భయపడ్డా. ముఖానికి ఎన్నో సర్జరీలు జరిగాయి. చిన్నప్పటి నుంచి అందాల పోటీలో పాల్గొనాలన్న నా కల నెరవేరదేమో అనిపించేది. ముఖ చర్మాన్ని పూర్వస్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నించే దాన్ని. ఎండకు దూరంగా ఉంటూ, తరచూ ఐస్‌ క్యూబ్స్‌తో కడిగే దాన్ని. మానసికంగా కుంగిపోయా. దాన్నుంచి బయటపడేందుకూ చాలా కష్టపడ్డా. ఇది కాక... నాకు పుట్టుకతోనే గుండెలో సమస్య. 12వ ఏట పేస్‌మేకర్‌ అమర్చి బతికించారు. వీలైనంత సేవ చేయాలన్నది నా కోరిక. అందుకే యుక్తవయసు నుంచే యూనిసెఫ్‌, డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ వంటి సంస్థలతో కలసి పనిచేస్తున్నా. 300కు పైగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. ప్రమాదం, అనారోగ్యం వంటివేవీ అందాల పోటీల లక్ష్యాన్ని ఆపలేక పోయాయి. పట్టుదలతో వీటన్నింటినీ ఓడించి, మిస్‌ వరల్డ్‌- 2021 రన్నరప్‌గా నిలిచా. ఇప్పుడు నా గుండెలో ఉన్న పేస్‌మేకర్‌ బ్యాటరీలు పనిచేయకపోవడంతో శస్త్రచికిత్స చేసి కొత్తది అమర్చారు. ఇలా మరో ఆరు సార్లు మార్చాల్సి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులెదురైనా సవాల్‌గా తీసుకొని ముందడుగేయాలి. ఎదుటి వారికి స్ఫూర్తిగా మారాలి. అప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. 

- శ్రీసైని మిస్‌ వరల్డ్‌-2021, రన్నరప్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్