పెరిగే పిల్లలకు ప్రొబయోటిక్స్‌..

చిన్నారులకు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే  ప్రొబయోటిక్స్‌ ఉన్న పదార్థాలను అందిస్తే మంచిదంటున్నారు ఆహార నిపుణులు. ఇవి పిల్లలకు నిండైన ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మెదడు అభివృద్ధిలోనూ తోడ్పడతాయని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి.

Published : 30 Oct 2022 00:34 IST

చిన్నారులకు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే  ప్రొబయోటిక్స్‌ ఉన్న పదార్థాలను అందిస్తే మంచిదంటున్నారు ఆహార నిపుణులు. ఇవి పిల్లలకు నిండైన ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మెదడు అభివృద్ధిలోనూ తోడ్పడతాయని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి.

కడుపులో నొప్పి, అతిసారం సహా ఇన్ఫెక్షన్లు, అజీర్తి వంటి వాటికి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు ప్రొబయోటిక్స్‌లో పుష్కలం. ఇవి ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి.. చెడు బ్యాక్టీరియాను నివారిస్తాయి. ఆహారం నుంచి విటమిన్లను శరీరానికి అందేలా చేస్తాయి. మెదడును ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. అధిక బరువుకు దూరంగా ఉంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణాశయ పనితీరును మెరుగు పరుస్తుంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శ్వాస సమస్యలను రానీయవు.

ఆహారంగా.. చిన్నారుల ఎదుగుదల్లో అత్యంత ముఖ్యపాత్ర వహించే ప్రొబయోటిక్స్‌ను రోజూ అందించాలి. అందుకు మజ్జిగ, పెరుగు, వెన్న వంటివి ఆహారంలో ఉండాలి. బార్లీ, గోధుమ, ఓట్స్‌ వంటి ధాన్యాలు, ఆకుకూరలు, క్యాబేజీ, సోయా ఉత్పత్తులు అందిస్తే మంచిది.

కీర దోసను చక్రాల్లా కోసి ఉప్పు నీటిలో నాననిచ్చి పిల్లలతో తినిపిస్తే మంచిది. లాక్టిక్‌ యాసిడ్‌ ఉన్న ఈ నానిన కీరదోస ముక్కల నుంచి ప్రొబయోటిక్స్‌ అందుతాయి. మంచి నీటికి బదులుగా పల్చని మజ్జిగ తరచూ ఇవ్వొచ్చు. పులిసిన మజ్జిగ కలిపిన దోశలు చిన్నారులకు మంచిది. సోయాబీన్స్‌ను పులియ బెట్టి తయారు చేసే టెంపేలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా  ప్రొబయోటిక్స్‌తోపాటు ఇనుము, జింక్‌ వంటివీ అందుతాయి. పులియబెట్టిన పదార్థాలను పిల్లలకు ఏదో ఒక రూపంలో రోజూ తినిపించాలి. ఆసక్తి చూపించకపోతే, కప్పు పెరుగులో తాజా పండ్ల ముక్కలు, చెంచా తేనె కలిపి అందిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్