వయసుని తగ్గించే స్వీట్‌కార్న్‌!

వేడివేడిగా ఉడికించిన స్వీట్‌కార్న్‌ని చూడగానే నోరూరుతుంది కదా! ఇది రుచిలోనే కాదు... పోషకాల్లోనూ మేటే. తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం! బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారం స్వీట్‌కార్న్‌. కెలొరీలు తక్కువగా ఉండే ఇందులో డైటరీ ఫైబర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి.

Updated : 01 Nov 2022 01:09 IST

వేడివేడిగా ఉడికించిన స్వీట్‌కార్న్‌ని చూడగానే నోరూరుతుంది కదా! ఇది రుచిలోనే కాదు... పోషకాల్లోనూ మేటే. తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం!

బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారం స్వీట్‌కార్న్‌. కెలొరీలు తక్కువగా ఉండే ఇందులో డైటరీ ఫైబర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లోని ఫెరులిక్‌ యాసిడ్‌ క్యాన్సర్‌కి అడ్డుకట్ట వేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా మీద పడకుండా నియంత్రిస్తుంది.

స్వీట్‌ కార్న్‌లోని పీచు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తే, మేలు చేసే బ్యాక్టీరియా జీవ క్రియల పనితీరుని మెరుగు పరుస్తుంది. ఇందులోని ఎ, బి విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. చురుకుదనాన్ని పెంచుతాయి. ఫోలేట్‌ గుండె సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది.

జియాక్సాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్‌ స్వీట్‌ కార్న్‌లో ఉంటుంది. ఇది కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్