సులువైన శంఖు ముద్ర

కొన్నిసార్లు ఒళ్లు వెచ్చగా, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. థర్మామీటర్‌తో చూస్తే మామూలుగానే ఉంటుంది. శారీరక అస్వస్థత లేదా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు.

Published : 05 Nov 2022 00:12 IST

కొన్నిసార్లు ఒళ్లు వెచ్చగా, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. థర్మామీటర్‌తో చూస్తే మామూలుగానే ఉంటుంది. శారీరక అస్వస్థత లేదా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు. ఇందుకు పరిష్కారం శంఖు ముద్ర. ఎంతో సులువైన ఈ ముద్రతో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.

ఇలా చేయాలి

పద్మాసనంలో లేదా సౌఖ్యంగా ఉండే ఆసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులనూ ఛాతీ ముందుకు, నాభికి దగ్గరగా తీసుకు రావాలి. ఎడమచేతి బొటనవేలిని కుడిచేయి నాలుగు వేళ్లతో మూయాలి. ఎడమచేయి చూపుడువేలు, మధ్య వేళ్లకు, కుడిచేతి బొటనవేలును ఆనించాలి. ఇలా ఆనించినప్పుడు చూస్తే శంఖాన్ని తలపిస్తుంది. ఈ ముద్రను శరీరానికి తగలనివ్వకుండా కళ్లు మూసుకుని ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదులుతూ కంఠంలో థైరాయిడ్‌ గ్రంథి ఉండే దగ్గర ధ్యాస ఉంచాలి. ఇలా ఉదయం, సాయంత్రం ఐదు నిమిషాలపాటు చేయాలి.

ప్రయోజనాలు

* శంఖు ముద్ర చేయడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గుతాయి.

* ఆకలి పెరుగుతుంది, జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.

* చర్మం మీద దద్దుర్లు, అలర్జీలు నయమవుతాయి.

* థైరాయిడ్‌ త్వరగా అదుపులోకి వస్తుంది. గొంతులో అసౌకర్యం, పట్టేసినట్టుండటం, జీర లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఒళ్లు వెచ్చగా ఉండటం, జ్వరమున్న భావన తగ్గుతాయి.

* మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్