పిల్లలు ఇబ్బంది పడుతుంటే...

స్వర్ణ కూతురు గీతిక ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంది. గంటలతరబడి వాష్‌రూంలోనే ఉండిపోతుంది. ఆకలి లేదంటుంది. కొన్నిరోజులుగా చదువూ, ఆటలపై కూడా శ్రద్ధ తగ్గింది.

Published : 07 Nov 2022 00:17 IST

స్వర్ణ కూతురు గీతిక ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంది. గంటలతరబడి వాష్‌రూంలోనే ఉండిపోతుంది. ఆకలి లేదంటుంది. కొన్నిరోజులుగా చదువూ, ఆటలపై కూడా శ్రద్ధ తగ్గింది. ఈ జీర్ణ సమస్యకు పరిష్కారంగా నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

ఉదయంపూట తీర్చుకునే కాలకృత్యాలు సవ్యంగా సాగితే జీర్ణశక్తి పెంపొందడమేకాదు, నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది. రాత్రిపూట ఆరు ఎండు ద్రాక్షలను గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని ఆ నీటితో సహా తాగితే మంచిది. అలానే, రోజూ ఆరేడు గ్లాసుల నీటిని తాగడం పిల్లలకు అలవాటు చేయాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటారు.

వ్యాయామం.. ఉదయం లేదా సాయంత్రం పిల్లలను కాసేపు ఆరుబయట ఆడుకునేలా చేయాలి. ప్రస్తుతం స్మార్ట్‌ స్క్రీన్‌లకు అలవాటుపడిన చిన్నారుల శరీరానికి తగిన వ్యాయామం లేక కండరాల్లో కదలిక తగ్గింది. ఆడుకోనివ్వండి. లేదా అరగంటసేపు స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి అలవరిస్తే చాలు. వీటితో పలురకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చిన్నారులకు అందుతాయి. వారికిష్టమైన క్రీడలు లేదా డ్యాన్స్‌ వంటివాటిలో ప్రోత్సహించినా మంచిదే.

నెయ్యితో.. ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉండే నెయ్యి ప్రతి రోజు పిల్లలకు రెండు చెంచాలు ఆహారంతో కలిపి అందించాలి. కప్పు గోరువెచ్చని పాలల్లో అరచెంచా నెయ్యి కలిపి ఉదయాన్నే పట్టిస్తే మంచిది. ఇందులోని పోషకాలు పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపించడానికి తోడ్పడతాయి. అలాగే కప్పు గోరువెచ్చని నీటిలో పావుచెంచా శొంఠిపొడి లేదా చెంచా తేనె కలిపి పొద్దున్నే తాగించినా ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్