లోపలి నుంచీ వెచ్చదనం!

చలి నుంచి రక్షగా ఉన్ని, మందమైన, దుస్తులను వేసుకుంటుంటాం. చలి కాచుకోవడం లాంటివీ చేస్తుంటాం. లోపలి నుంచీ వెచ్చదనం అందిస్తేనే దాన్ని ఓడించడం సాధ్యం. అందుకు సాయపడే ఆహార పదార్థాలివీ!

Updated : 12 Nov 2022 04:42 IST

చలి నుంచి రక్షగా ఉన్ని, మందమైన, దుస్తులను వేసుకుంటుంటాం. చలి కాచుకోవడం లాంటివీ చేస్తుంటాం. లోపలి నుంచీ వెచ్చదనం అందిస్తేనే దాన్ని ఓడించడం సాధ్యం. అందుకు సాయపడే ఆహార పదార్థాలివీ!

* మాంసం.. మటన్‌కి ప్రాధాన్యమివ్వాలి. దీనిలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. శరీరమంతటా ఆక్సిజన్‌ సరఫరా సాఫీగా సాగాలంటే ఇది తప్పనిసరి. చేతులు, కాళ్లు చల్లబడటం, ఊరికే అలసిపోవడం లాంటివి కనిపిస్తున్నాయంటే ఐరన్‌ తగ్గిందని అర్థం. గోంగూర, మటన్‌ వంటివి ఎక్కువ తీసుకోండి. వీటి ద్వారా విటమిన్‌ బి12తోపాటు రోగనిరోధకతా పెరుగుతుంది.

* తేనె.. ఈ కాలం జలుబు, దగ్గు, వైరస్‌లతో వచ్చే జబ్బులతో పెద్ద తలనొప్పి. తేనెను తరచూ తీసుకోండి. రోగని రోధకతను పెంచి వీటితో పోరాడేలా చేస్తుంది. చర్మానికి అందాన్నివ్వడంతోపాటు జీర్ణప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. శరీరానికి వెచ్చ దనాన్నిస్తుంది.

* అరటి.. విటమిన్‌ బి, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో లభ్యమవుతాయి. ఇవి థైరాయిడ్‌, అడ్రినలిన్‌ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా శరీర వేడిమిని నియంత్రిస్తాయి. ఈకాలంలో బద్ధకంగా అనిపిస్తుంది కదా! అరటిపండు మనసును ఉత్తేజపరచడంతోపాటు జ్ఞాపశక్తినీ మెరుగుపరుస్తుంది.

* చిలగడ దుంప.. చలికాలంలో ఆహారం త్వరగా జీర్ణమవదు. అందుకే బద్ధకంగానూ అనిపిస్తుంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరానికి కావాల్సిన వేడీ అందుతుంది. అదనంగా ఎ, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్‌ వంటివీ లభిస్తాయి.

* అల్లం టీ.. చల్లగాలికి వెచ్చటి టీ తాగుతోంటే ఆ అనుభూతే వేరు. అది ఆ క్షణం వరకే! దానికి అల్లం చేర్చుకోండి. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడమే కాదు.. శరీరాన్నీ వెచ్చబరుస్తుంది.

* నెయ్యి.. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యమెక్కువ. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతోపాటు దేహానికి అవసరమయ్యే మంచి కొవ్వునీ అందిస్తుంది. రోజూ స్పూను చొప్పున ఆహారానికి చేర్చుకోండి. రుచితోపాటు వెచ్చదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్