వికారంగా అనిపిస్తోందా?

గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ‘అమ్మ’కు కష్టాలు మొదలు. హార్మోనుల్లో మార్పులు చికాకు కలిగిస్తోంటే.. వాంతులు, వికారం నీరస పరుస్తాయి. ప్రతి చిన్న వాసనా కడుపులో తిప్పేస్తున్నట్లు చేస్తుంది.

Published : 15 Nov 2022 00:47 IST

గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ‘అమ్మ’కు కష్టాలు మొదలు. హార్మోనుల్లో మార్పులు చికాకు కలిగిస్తోంటే.. వాంతులు, వికారం నీరస పరుస్తాయి. ప్రతి చిన్న వాసనా కడుపులో తిప్పేస్తున్నట్లు చేస్తుంది. ఈ సమస్య తొలి నెలల్లో మరీ ఎక్కువ. దీన్నుంచి తప్పించుకోవాలా.. చిట్కాలివిగో!

ఉదయాన్నే చిన్నగ్లాసు నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తీసుకోండి.. ఉపశమనంగా ఉంటుంది. ఎక్కడికి వెళుతున్నా నిమ్మకాయనో, దాంతో చేసిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కర్చీఫ్‌పై వేసుకొనో తీసుకెళ్లండి. వికారంగా అనిపించినప్పుడల్లా వాసన చూస్తే సరి. సమస్య దూరమవుతుంది.

* ఇలాంటి సమయాల్లో బిస్కెట్లు దగ్గర ఉంచుకోవాలట. కడుపులో తిప్పినట్లుగా అనిపించినప్పుడు చిన్న ముక్క తినేస్తే సరి. నీళ్లూ చేదుగా అనిపిస్తున్నాయి కదూ! బలవంతంగా తాగితేనేమో వెంటనే బయటికి వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు.. ఒకేసారి తాగొద్దు. గుర్తుంచుకొని మరీ కొద్దికొద్దిగా తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. నీటిలో పండ్ల ముక్కలు వేసుకుని తాగొచ్చు. మజ్జిగ, జ్యూసులు తీసుకున్నా మంచిదే.

* విటమిన్‌ బి6 ఈ సమస్యను దూరం చేయగలదు. అరటి పండ్లు, చేప, అవకాడో, బ్రౌన్‌ రైస్‌, మొక్కజొన్న, నట్స్‌లో ఇది సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరి. చిన్న అల్లం ముక్కను బుగ్గన ఉంచుకోండి. లేదూ ఉదయాన్నే స్పూను అల్లం రసంలో తేనె కలిపి తీసుకున్నా, అల్లం టీ తాగినా ప్రయోజనం ఉంటుంది.

*ఎక్కువ నూనె, కారం ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. మూడు పూటల లెక్కన కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తింటే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్