ఉలవలు తింటే... ఎగురుతారు!

ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువే. పిల్లలూ, పెద్దలూ... ముఖ్యంగా మహిళలు దీన్ని ఆహారంలో తప్పక భాగం చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.

Updated : 21 Nov 2022 03:06 IST

ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువే. పిల్లలూ, పెద్దలూ... ముఖ్యంగా మహిళలు దీన్ని ఆహారంలో తప్పక భాగం చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.

* గుగ్గిళ్లు చేసుకుంటారా? చారే కాసుకుంటారా మీ ఇష్టం... కానీ, పోషకాహార లోపంతో బాధ పడే వారు మాత్రం ఉలవలు క్రమం తప్పక తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌లతో పాటు బోలెడంత పీచూ లభిస్తుంది. ఇవి జీర్ణశక్తి మెరుగుదలకూ మంచిదే.

* రక్తహీనతతో బాధపడేవారూ, కీళ్ల నొప్పులూ, ఇతరత్రా ఎముక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారూ, మహిళలూ, పిల్లలూ వీటిని కనీసం రెండు చెంచాలైనా తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడా క్యాల్షియం శరీరానికి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి.

* రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలూ... చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువూ అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్