పోషకాల రాణీ... బఠాణీ

పచ్చి బఠాణీలు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి కదూ! నిజానికి అలా ప్యాకెట్లలో అమ్మే బఠాణీలు తాజావి కాదు.

Published : 22 Nov 2022 00:16 IST

చ్చి బఠాణీలు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి కదూ! నిజానికి అలా ప్యాకెట్లలో అమ్మే బఠాణీలు తాజావి కాదు. నిలవుండేందుకు రసాయనాలు, ఆకర్షణ కోసం ఆకుపచ్చ రంగు వేస్తారు. అవి తినడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువని చెబుతున్నారు ఆహార నిపుణులు. ‘కానీ వాటిని మనం పండించలేం కదా’ అనుకుంటున్నారా?! అంత కష్టం అవసరం లేదు. ఈ కాలంలో బఠాణీ కాయలు ఎక్కువగా కొనండి. గింజలు ఒలిచి జిప్‌లాక్‌ కవర్లలో వేసి ఫ్రీజర్‌లో పెట్టేయండి. కావాల్సి నప్పుడల్లా వాడుకోవచ్చు. రసాయనాల బాధ తప్పడమే కాదు, తాజాగా, రుచిగా ఉంటాయి.

* బఠాణీల్లో కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, సెలేనియం, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా ఉన్నందున మంచి పోషకాహారం. వీటిని ఏదో రూపంలో తరచుగా తినడం అలవాటు చేసుకోవాలి.

* వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నందున మంట, తాపం, గాయాలను మాన్పుతాయి. యాంటీ క్యాన్సర్‌ కారకాలు కూడా.

* బఠాణీలు గుండెకు మేలు చేస్తాయి. అధిక రక్తపోటును నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి కనుక మధుమేహులకు మంచిది. ఎర్రరక్త కణాల పనితీరును మెరుగు పరుస్తాయి. శరీరమంతటికీ ప్రాణ వాయువును అందించడంలో తోడ్పడతాయి.

* వీటిలోని పీచు జీర్ణప్రక్రియ సాఫీగా ఉండేలా చేస్తుంది. ఊబకాయాన్ని రానివ్వదు. సి-విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

* బాఠాణీలు కడుపుబ్బరం కలిగించే మాట నిజం. దాన్ని నివారించేందుకు నీళ్లు ఎక్కువగా తాగితే సరి.

* కూరల్లో బఠాణీలు వేస్తే ఆ రుచే వేరు. బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌, కిచిడీల్లో వీటిదే పెద్ద పాత్ర. సూప్‌, సలాడ్స్‌లో ప్రత్యేక రుచినిస్తాయి. ఉడికించి లేదా వేయించి ఉప్పూ, మిరియాల పొడి జల్లి స్నాక్స్‌గా అందిస్తే పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తినేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్