చలికాలంలో..బరువు తగ్గాలా?

ఈ చల్లని వాతావరణంలో తప్పదు కాబట్టి లేస్తాం కానీ బద్ధకంగా అనిపిస్తుంటుంది.

Published : 25 Nov 2022 00:39 IST

ఈ చల్లని వాతావరణంలో తప్పదు కాబట్టి లేస్తాం కానీ బద్ధకంగా అనిపిస్తుంటుంది. దీనికితోడు తరచూ జలుబు, దగ్గు. అప్పుడప్పుడూ ఒళ్లునొప్పులు. ఇక వ్యాయామం మీదికి మనసెలా మళ్లుతుంది? మరి ఊరుకుంటే బరువు పెరిగిపోతాం కదా... అందుకే వీటిని తరచూ తీసుకోమంటున్నారు నిపుణులు. ఇవి మనసునూ ఉల్లాసంగా ఉంచుతాయట!


నారింజ.. దీనిలో ‘విటమిన్‌ సి’ పుష్కలం. కొవ్వును కరిగించడంలో ‘సి’దే ప్రధాన పాత్ర. అంతేకాదు మెటబాలిజంనూ మెరుగుపరుస్తుంది. నీరు ఎక్కువగా ఉంటుంది కదా.. ఆకలినీ అదుపు చేయగలదట.


అంజీరా.. దీన్లో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్‌ కడుపు నిండినట్లుగా చేస్తుంది. దీనిలో ఫిసిన్‌ అనే ఎంజైమ్‌.. జీర్ణక్రియను వేగవంతం చేయడంతోపాటు పొట్టదగ్గర పేరుకున్న కొవ్వునీ తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు, కాపర్‌, మెగ్నీషియం, పొటాషియంలనూ అందిస్తుంది.


స్టార్‌ఫ్రూట్‌.. డైట్‌ చేసేవాళ్ల ప్రధాన సూత్రం.. లో కెలోరీలు! అందుకే ఈ పండుని వాళ్లకి ఉత్తమ ఎంపికగా చెబుతుంటారు. అంతేకాదు.. పొట్ట నిండినట్లుగా చేసి, త్వరగా ఆకలి కాకుండా చూస్తుంది. దీంతో పేరుకున్న కొవ్వూ కరిగి, బరువు తగ్గుతారు. గ్యాస్‌, తేన్పులు, ఒంటినొప్పులు వంటి వాటికీ ఇది మంచి మందు.


జామ.. ఈ కాలంలో స్నాక్‌కి మంచి ప్రత్యామ్నాయం. తీపిపదార్థాలపై మనసు మళ్లినప్పుడు దీన్ని తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఫ్లూ వంటి వాటినీ రానివ్వదు. పెద్దమొత్తంలో ఉండే ఫైబర్‌, విటమిన్‌సి బరువు తగ్గడంలో సాయపడటమే కాదు.. రోగ నిరోధకతనీ పెంచుతాయి.


సీతాఫలం.. విటమిన్లు, మినరల్స్‌ల ఖజానా! ఎ, సి విటమిన్లు, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈకాలంలో పొట్టఉబ్బరం, మలబద్ధకం వేధిస్తుంటాయి. ఆ సమస్యల్ని దూరం చేసి, జీర్ణవ్యవస్థను రక్షిస్తుంది. వీటిలోని గుణాలు చర్మానికీ మేలు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్