..అయితే మంచం దిగకండి!

ఉదయాన్నే అలారం మోగగానే.. ‘ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు’ అనిపిస్తోంది కదా! నిద్రలేచినా అలా మంచం మీదే ఉండిపోతాం.

Published : 27 Nov 2022 00:06 IST

ఉదయాన్నే అలారం మోగగానే.. ‘ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు’ అనిపిస్తోంది కదా! నిద్రలేచినా అలా మంచం మీదే ఉండిపోతాం. మీది అదే తరహానా? మరి వ్యాయామం సంగతీ ఆలోచించాలిగా! పోనీ మంచం మీద ఉండే చేసేయండిలా..


బ్యాక్‌ ఎక్స్‌టెన్షన్‌.. బోర్లా పడుకోవాలి. రెండు చేతులూ పైకి చాచాలి. ఇప్పుడు నడుము కదలకుండా చేతులు, కాళ్లను మాత్రం ఒకేసారి పైకి లేపడం, కిందకి రావడం చేయాలి. ఇలా ఒక్కో విడతలో 20 సార్లు చొప్పున అయిదు విడతలు చేయాలి. ఇది వెన్నెముక, భుజాలు, నడుమును బలంగా మారుస్తుంది.


హిప్‌ బ్రిడ్జ్‌.. వెల్లికిలా పడుకోవాలి. తర్వాత కాళ్లను ముడవాలి. చేతుల్ని శరీరం పక్కన ఉంచి నడుము భాగం వరకూ వీలైనంత పైకి లేపాలి. ఓ నిమిషం అలానే ఉండాలి. కాస్త విశ్రాంతి తర్వాత తిరిగి చేయాలి. ఇలా నాలుగు సెట్లు చేయాలి. కాళ్లను దృఢపరచడంతోపాటు నడుం నొప్పినీ దూరం చేస్తుంది.


ప్లాంక్‌.. మంచం మీద బోర్లా పడుకోండి. మోచేతులు, కాళ్ల మునివేళ్లని ఆధారంగా చేసుకొని మొత్తం శరీరాన్ని పైకి లేపాలి. అలా కనీసం 45 సెకన్లు ఉండాలి. కొద్ది సెకన్లు విశ్రాంతి తీసుకొని ఇంకో మూడు సార్లు చేయండి. ఇది భుజాలు, మెడ, పక్క టెముకల్ని దృఢంగా చేస్తుంది. పొట్టదగ్గర కొవ్వునీ తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల్ని తగ్గించడంతోపాటు మెటబాలిజాన్నీ మెరుగు పరుస్తుంది.


ట్రైసెప్‌ డిప్‌.. కాళ్లు కిందకి ఆనేలా మంచమ్మీద కూర్చోవాలి. రెండు చేతుల్నీ మంచానికి ఆధారంగా చేసుకొని వీలైనంత కింద కూర్చొని పైకి లేవడం చేయాలి. ఇలా సెట్టుకి 15 చొప్పున నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది. ఉదర భాగానికీ, చేతులకు మంచి వ్యాయామం. పొత్తికడుపు, కటి భాగాల్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్