పళ్లు.. జివ్వుమంటోంటే..

ఏ కాలమైనా ఉదయాన్నే లేవడం మనకు తప్పదు. అసలే చలి.. ఆ చల్లదనానికి చర్మమంతా పొడిబారి పోతుంది.

Updated : 29 Nov 2022 04:53 IST

ఏ కాలమైనా ఉదయాన్నే లేవడం మనకు తప్పదు. అసలే చలి.. ఆ చల్లదనానికి చర్మమంతా పొడిబారి పోతుంది. ఈమధ్య పళ్లు కూడా లాగుతున్నట్టు అనిపిస్తున్నాయా? దానికీ చలిగాలులే కారణం.

* ఈ కాలం గాలిలో తేమ తగ్గుతుంది. ఫలితమే డీహైడ్రేషన్‌! పైగా ఈ కాలంలో పెద్దగా నీరు తాగాలనిపించదు. ఇవన్నీ పంటి నొప్పికి కారణమవుతాయట. కాబట్టి, కనీసం 2 లీటర్ల నీటిని తాగేలా చూసుకోండి.

* చల్లగాలికి వేడివేడిగా టీ తాగాలని అనిపిస్తుంటుంది. ఇంకేం.. మనసు కోరినప్పుడల్లా ఓ టీ లేదా కాఫీ లోపలికి వెచ్చగా జారిపోతుంది. అంటే చక్కెర శాతం పెరుగుతున్నట్టేగా! చక్కెరలు త్వరగా బాక్టీరియాను ఆకర్షిస్తాయి. ఫలితమే పళ్ల సమస్యలు. వీలైనంత వరకూ తగ్గిస్తే మేలు.ః అన్ని కాలాలకూ ఒకే రకమైన దుస్తులు వేస్తామా? లేదు కదా! టూత్‌ బ్రష్‌ విషయంలోనూ ఈ సూత్రాన్ని పాటించాలట. చిగుళ్లు సున్నితంగా మారుతున్నా నొప్పి బాధిస్తుంది. కాబట్టి సున్నితమైన కుచ్చు ఉన్న బ్రష్‌కి మారిపోండి. సెన్సివిటీని తగ్గించే మెడికేటెడ్‌ పేస్ట్‌ని ఎంచుకుంటే నొప్పిని దూరంగా ఉంచొచ్చు.

* చలిగా ఉన్నప్పుడు బయటికి వెళ్లాల్సొస్తే.. ముఖాన్ని కవర్‌ చేసుకోవడం మరచిపోవద్దు. జలుబు, తలపట్టేయడం వంటివీ పళ్లు లాగుతున్నట్లుగా చేస్తాయి. పెదాలు తేమ కోల్పోకుండా చూసుకున్నా.. సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

* సోడాలు, కూల్‌డ్రింక్‌లకు దూరంగా ఉండాలి. ఇవి పళ్లపై పొరను కరిగించేస్తాయి. ఏదైనా తిన్నా, తాగినా తర్వాత పుక్కిలించడం అలవాటుగా మార్చుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్