వెన్నునొప్పి తగ్గాలంటే...

మనలో కొందరు ఎక్కువసేపు నిలబడలేక, కూర్చోలేక అవస్థ పడుతుంటారు. ఇంకొందరికైతే పడుకోవడానికీ ఇబ్బందిగా ఉంటుంది. ఇదంతా వెన్నెముక దృఢంగా లేకపోవడం వల్లనే.

Updated : 25 Mar 2023 16:56 IST

మనలో కొందరు ఎక్కువసేపు నిలబడలేక, కూర్చోలేక అవస్థ పడుతుంటారు. ఇంకొందరికైతే పడుకోవడానికీ ఇబ్బందిగా ఉంటుంది. ఇదంతా వెన్నెముక దృఢంగా లేకపోవడం వల్లనే. ఈ సమస్యకు యోగాలో పరిష్కారం ఉంది. మీరు చేయాల్సిందల్లా రెండంటే రెండు నిమిషాల పాటు మార్జాలాసనం వేయడం. అప్పుడు కొద్ది రోజుల్లోనే ఉపశమనం లభిస్తుంది.

ఎలా చేయాలంటే...

పిల్లిని పోలిన భంగిమ కనుకే  దీన్ని ‘క్యాట్‌ స్ట్రెచింగ్‌’ అంటారు. ముందుగా రెండు మోకాళ్ల మీద కూర్చోవాలి. ఫొటోలో చూపిన విధంగా కుడి కాలును లేపి వెనక్కి, ఎడమ చేతిని ముందువైపుకి చాపాలి. రెండింటినీ వంచకూడదు. కుడిచేతిని ఆసరాగా నేలమీద ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ పది నుంచి ఇరవై సెకన్లు ఈ భంగిమలో ఉండాలి. తర్వాత ఎడమ కాలును వెనక్కి, కుడిచేతిని ముందుకు తిన్నగా జాపాలి. ఎడమచేతిని ఆసరాగా నేలమీద ఉంచాలి. ఇలా కుడికాలు - ఎడమచెయ్యి చాచి మూడుసార్లు, ఎడమకాలు - కుడిచెయ్యి చాచి ఇంకో మూడు సార్లు చొప్పున చేయాలి.

ప్రయోజనాలు

మార్జాలాసనం వల్ల వెన్నె ముక దృఢంగా తయారవుతుంది. వెన్నునొప్పి, నడుంనొప్పి రావు. పొట్ట, నడుము, పిరుదుల వద్దనున్న అధిక కొవ్వు కరిగిపోతుంది. ఒకవేళ మీరిప్పటికే అలాంటి బాధ అనుభవిస్తుంటే కూడా ఈ ఆసనం చేయొచ్చు. త్వరలోనే ఉపశమనం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్