బీపీని తగ్గించే అవిసెగింజలు

పని ఒత్తిడి, మారిన ఆహారపుటలవాట్లు కారణం ఏమైతేనేమి? ఇటీవలి కాలంలో మహిళల్లో పోషకాల లేమి స్పష్టంగా కనబడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. దీన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి అని చెబుతున్నారు.

Updated : 03 Dec 2022 05:03 IST

పని ఒత్తిడి, మారిన ఆహారపుటలవాట్లు కారణం ఏమైతేనేమి? ఇటీవలి కాలంలో మహిళల్లో పోషకాల లేమి స్పష్టంగా కనబడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. దీన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి అని చెబుతున్నారు.

* ప్రొటీన్‌ ఎక్కువగా లభించే వాటిలో అవిసెగింజలు ఒకటి. వీటిని క్రమం తప్పకుండా ఓ చెంచా అయినా తినగలిగితే... కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

* అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు తగినంతగా లభిస్తాయి. వీటిలోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ గుండెకు రక్తసరఫరా చేసే నాళాల్లో కొలెస్ట్రాల్‌ని పేరుకోనీయదు. ఈ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మలబద్ధకం అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే థయామిన్‌... కణాల ఆరోగ్యాన్నీ, జీవక్రియల పనితీరునీ మెరుగు పరచడంలో కీలకం.

* అవిసెగింజలు హార్మోన్లను సమతులం చేస్తాయి. ఫలితంగా నెలసరులు క్రమం తప్పకుండా ఉంటాయి. అవిసె గింజల్లోని ఒమేగా-3 యాసిడ్లు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువూ తగ్గొచ్చు.

* గింజల్లో దొరికే లిగ్నాన్స్‌ క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తాయి. రక్తపోటుని నియంత్రించి రక్తం గడ్డకట్టే సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడినీ తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్