ఈ బ్రేస్‌లెట్‌తో ఆరోగ్యం

చూడ్డానికి బ్రేస్‌లెట్‌లా భలే అందంగా ఉంది కదా! దీని పేరు బెల్లాబీట్‌. బ్రేస్‌లెట్‌లానే ఉంటుంది కానీ.. మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించడానికి తయారుచేసిన స్మార్ట్‌ పరికరం ఇది.

Published : 08 Dec 2022 00:15 IST

చూడ్డానికి బ్రేస్‌లెట్‌లా భలే అందంగా ఉంది కదా! దీని పేరు బెల్లాబీట్‌. బ్రేస్‌లెట్‌లానే ఉంటుంది కానీ.. మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించడానికి తయారుచేసిన స్మార్ట్‌ పరికరం ఇది. యాప్‌ ఆధారితమైన ఈ పరికరం... మన నెలసరి వివరాలు, నిద్ర, బీపీ, శరీరంలోని నీటిశాతాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని వాటి ఆధారంగా పనిచేస్తుంది. నెలసరి, గర్భధారణ, ముందస్తు మెనోపాజ్‌ వంటి విషయాలను గుర్తించి తెలియచెబుతుంది. వయసుకు తగిన వ్యాయామాలు చేసేందుకు మార్గదర్శనం చేస్తుంది. బరువు తగ్గడం వంటి లక్ష్యాలను పూర్తిచేయడానికి కావాల్సిన సహకారం అందిస్తుంది. ఇవి ఆకర్షణీయ రంగుల్లోనూ దొరుకుతున్నాయి. నచ్చింది ఎంపిక చేసుకుని... పెట్టేసుకోండి. అటు అందం.. ఇటు ఆరోగ్యం కూడాను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్