మెంతికూరనీ మెచ్చండి!

పప్పే అయినా, పచ్చడి చేసుకున్నా.... చక్కని రుచితో పాటు... ఆరోగ్యాన్నీ అందించే ఆకుకూరల్లో మెంతి ఒకటి. మరి దాని ప్రయోజనాలేంటో చూద్దామా? అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బందిపడే వారు క్రమం తప్పక మెంతి కూరను తీసుకోవడం మంచిదంటున్నాయి పలు అధ్యయనాలు.

Updated : 10 Dec 2022 04:14 IST

పప్పే అయినా, పచ్చడి చేసుకున్నా.... చక్కని రుచితో పాటు... ఆరోగ్యాన్నీ అందించే ఆకుకూరల్లో మెంతి ఒకటి. మరి దాని ప్రయోజనాలేంటో చూద్దామా?

అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బందిపడే వారు క్రమం తప్పక మెంతి కూరను తీసుకోవడం మంచిదంటున్నాయి పలు అధ్యయనాలు. అధిక రక్తపోటూ, గుండె సంబంధిత సమస్యలనూ ఇందులోని పోషకాలు అదుపులో ఉంచుతాయి.

బరువు తగ్గించడంలో మెంతికూర ఎంతో ఉపకారి. ఇందులో ఉండే పీచు... ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడంలో సహకరిస్తుంది. అతిగా తినే అలవాటునీ తగ్గిస్తుంది. ఈ రెండూ బరువు పెరగకుండా చేస్తాయి. మెంతిలో విటమిన్‌ సి, ఎ, బీటా కెరొటిన్‌ వంటివి ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి... ఫ్రీ రాడికల్స్‌ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

నెలసరి క్రమం తప్పుతోంటే... కొన్నాళ్లు రోజూ మెంతికూర తీసుకోమంటున్నాయి కొన్ని అధ్యయనాలు. తల్లిపాలనూ వృద్ధి చేస్తాయట. ఇందులో ఎక్కువ మోతాదులో క్యాల్షియం, మెగ్నీషియం, కొద్దిమోతాదులో డి లభిస్తాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్