చలికాలం చురుగ్గా...

చలి పంజా విసురుతోంది. దాంతో శారీరకంగానూ కాస్త బద్ధకం, ఇంకొంత నీరసం ఆవహించి... పని వేగం మందగిస్తుంది.

Updated : 15 Dec 2022 02:50 IST

చలి పంజా విసురుతోంది. దాంతో శారీరకంగానూ కాస్త బద్ధకం, ఇంకొంత నీరసం ఆవహించి... పని వేగం మందగిస్తుంది. అలా కాకుండా చురుగ్గా ఉండాలంటే ఏం తినాలో సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

తృణధాన్యాలు: వీటి స్వభావరీత్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా... శరీరానికి అవసరమైన పోషకాలనిస్తాయి. వీటిలోని మాంసకృత్తులూ, పీచు మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

గింజలు: మధ్యాహ్నం భోజనం అయ్యాక... రెండు గంటల తర్వాత నట్స్‌ లేదా సీడ్స్‌ని స్నాక్స్‌లా తీసుకోండి. ఇవి అలసటను రానీయవు. శరీరానికి ఫైబర్‌, విటమిన్లూ కూడా సరైన మోతాదులో అందుతాయి.

ఓట్స్‌: ఓ కప్పు ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకుని ఉదయాన్ని ప్రారంభించండి. ఇందులో ఫైబర్‌తో పాటు ప్రొటీన్‌ ఉంటుంది. విటమిన్‌ బి సహజంగా శరీరానికి లభిస్తుంది. కొవ్వుని కరిగించడంలో, శరీరంలో ఇన్సులిన్‌ స్థాయులు తగ్గకుండానూ ఇందులోని పోషకాలు సాయపడతాయి. ఫలితంగా రోజంతా శక్తిని కోల్పోకుండా ఉంటారు.

చియా సీడ్స్‌: పోషకాలు నిండుగా ఉండే వీటిల్లో కార్బోహైడ్రేట్‌లూ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులూ, ఫైబర్‌ రోజంతా శక్తినిస్తాయి.

పాలకూర: ఇందులో ఐరన్‌తోపాటు విటమిన్‌ సి, ఫోలేట్‌ ఎక్కువగా ఉంటాయి.

గుడ్లు: రుచే కాదు... ప్రొటీన్‌ ఎక్కువగా దొరికే ఆహారం గుడ్లు. ఇందులోని హెల్తీ ఫ్యాట్స్‌ శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్‌, జింక్‌, విటమిన్‌- ఇ పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటూ శరీరానికి కావలసినన్ని కెలొరీలూ అందుతాయి. విటమిన్‌ డి, అమైనో ఆమ్లాలూ.. కోల్పోయిన శక్తిని పుంజుకునేలా చేస్తాయి

పండ్ల్లు, కూరగాయలు: అన్ని రకాల కూర గాయలూ, పండ్లను తీసుకోవడం వల్ల మినరల్స్‌, విటమిన్‌ సి, ఎ వంటివి దండిగా దొరుకుతాయి. ఇవన్నీ అవసరమైన పోషకాలు అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్