నిలబడి.. నడవొచ్చు!

జిమ్‌కెళ్లడానికి తీరిక లేదని చెప్పేవారే ఎక్కువ. ఇలాంటి వారు ప్రత్యేకంగా సమయం కేటాయించనక్కర్లేకుండానే వ్యాయామం ఎలా చేయచ్చంటే...

Updated : 17 Dec 2022 01:25 IST

జిమ్‌కెళ్లడానికి తీరిక లేదని చెప్పేవారే ఎక్కువ. ఇలాంటి వారు ప్రత్యేకంగా సమయం కేటాయించనక్కర్లేకుండానే వ్యాయామం ఎలా చేయచ్చంటే...

* బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... శారీరక శ్రమ అవసరం. దానికి ఉదయాన్నే సమయం కేటాయించ లేకపోతే... మీ పనంతా అయ్యాకే... వ్యాయామం చేయండి. లేదంటే రోజు మధ్యలో పది నిమిషాల చొప్పున చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేయండి. ఇవన్నీ శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.

* నడవడం వల్ల బరువు తగ్గడమే కాక కాళ్లు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారుతాయి. ఎముకలు గట్టిపడతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నిద్రలేమి అదుపులో ఉంటుంది. ఇందుకోసం ఉన్న చోటే ఉండి కూడా ట్రెడ్‌మిల్‌ తరహాలో వాకింగ్‌ చేసేయొచ్చు. ఇదీ శరీరం మొత్తానికీ కదలిక తెచ్చి వ్యాయామ ఫలితం అందిస్తుంది.

* నడకకి ట్రాక్‌సూట్లూ, బూట్లే అక్కర్లేదు. వట్టి పాదాలతోనూ నడవొచ్చు. అయితే ఇది శుభ్రమైన పచ్చిక బయళ్ల మీద మాత్రమే. ఈ తరహా నడక పాదాలకు రక్తప్రసరణ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్