ఔరా కొబ్బరి!

అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే కొబ్బరి ప్రయోజనాలు ఎన్నెన్నో. అందుకే పోషకాల లేమికి చక్కటి మందుగా చెబుతారు వైద్యులు.

Updated : 18 Dec 2022 05:32 IST

అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే కొబ్బరి ప్రయోజనాలు ఎన్నెన్నో. అందుకే పోషకాల లేమికి చక్కటి మందుగా చెబుతారు వైద్యులు.

* కొబ్బరిలో కొలెస్ట్రాల్‌ పదార్థాలుండవు. అధిక మోతాదులో కెలొరీలూ, ప్రొటీన్లు, మంచి కొవ్వూ, పీచు పదార్థాలెన్నో ఉంటాయి. ఇవి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. థైరాయిడ్‌ కూడా అదుపులో ఉంటుంది.

* ఇందులో విటమిన్లు సి, ఇ, బి1, బి6, బి5, ఫోలేట్‌, బి3లతో పాటు ఐరన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలెన్నో సమృద్ధిగా దొరుకుతాయి. కొబ్బరి శరీరానికి శక్తినిస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది. 

* రక్తహీనతతో బాధపడే మహిళలు రోజూ ఓ చిన్న కొబ్బరి ముక్కని తినొచ్చు లేదంటే ఓ కప్పు కొబ్బరి పాలను తాగినా మంచిదే. దానికి కాస్త బెల్లం తరుగుని కూడా చేర్చితే మేలు.

* ఎదిగే పిల్లలు, ప్రొటీన్‌తో పాటు ఇతరత్రా పోషకాల లోపంతో బాధపడేవారు రోజూ రెండు చెంచాల కొబ్బరి తురుముని తీసుకుంటే సరి. కండరాలు వృద్ధి చెందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

* కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దెబ్బ తిన్న కణాలను వృద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.

* జుట్టు ఎక్కువగా రాలుతుంటే... జింక్‌ ఎక్కువగా ఉండే కొబ్బరిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. మాంగనీస్‌ నిల్వలు తగ్గినప్పుడు గ్లూకోజ్‌ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కాసిని కొబ్బరిపాలో, కొబ్బరి ముక్కో తీసుకున్నా చాలు సమతుల్యం అవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్