అతికి అడ్డుకట్ట

రాత్రే ఆత్మీయులతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికినా.. ఈ రోజంతా పార్టీ మూడ్‌లోనే ఉంటాం. మిఠాయిలు, కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌.. వంటివి తప్పనిసరి. శరీరంలో కెలోరీలు పెరిగిపోవూ?

Updated : 01 Jan 2023 05:19 IST

రాత్రే ఆత్మీయులతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికినా.. ఈ రోజంతా పార్టీ మూడ్‌లోనే ఉంటాం. మిఠాయిలు, కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌.. వంటివి తప్పనిసరి. శరీరంలో కెలోరీలు పెరిగిపోవూ?

* బయటికి వెళ్లేప్పుడు నోటిని అదుపు చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కబుర్లలో పడో.. నోరూరో ‘ఈరోజుకి ఫర్లేదు’ అనేసుకొంటాం. తర్వాత అనవసరంగా తిన్నామంటూ నిందించుకోవడం! ఇవి తప్పాలంటే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ ఇంటి నుంచే తీసుకెళ్లండి. లేదూ అక్కడే ముందుగా వాటినే ఆర్డర్‌ ఇచ్చుకుంటే సమస్య ఉండదు. మొటిమలు, అధిక బరువుల బెంగ ఉండదు.

* కబుర్లలో పడితే సమయం తెలియదు. చాలా సార్లు ఎంత తిన్నామో కూడా గమనించుకోం. మరి కెలోరీలు పెరగవా? ప్లేటులోకి వడ్డించుకునే ముందే ఎంత పెట్టుకోవాలన్నది నిర్ణయించుకోండి. నిజంగా ఆకలేసి తింటున్నామా.. ఉబుసుపోకా అన్నది గమనించుకుంటూ ఉండాలి.

* రాత్రి ఎలాగూ ఆలస్యమవుతుంది. ఉదయాన్నే స్నేహితుల వద్దకి సమయానికి చేరుకోలేమని తిండిని పక్కనపెట్టేస్తాం. ఆకలేసి ఏదో ఒకటి తినేయడమో.. అతిగా తినడమో చేస్తాం. ఇదీ మంచిది కాదు. అల్పాహారంగా పండ్లు, నట్స్‌ వంటివి తీసుకోండి. ఆకలి వేయదు.. పైగా ఆరోగ్యం.

* కూల్‌డ్రింక్స్‌, సోడా వంటివి చర్మానికి హాని చేస్తాయి. బదులుగా నీరు లేదంటే పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మిల్క్‌షేక్‌, నిమ్మకాయ నీళ్లు వంటివి తాగడం మేలు.

* ప్రత్యేక రోజులేవైనా స్వీట్లు ఆకర్షిస్తుంటాయి. ఒకటో, రెండో తినడం వల్ల నష్టమేమీ లేదు. అంతకు మించుతోంటే.. ఖర్జూరా, పండ్లు, బెల్లంతో చేసినవాటికి ప్రాధాన్యమివ్వండి. తీపి తిన్న భావన.. అదనంగా పోషకాలూ అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్