నూనె పుక్కిలిస్తారా?

అందంలో చిరునవ్వుదీ ప్రధాన పాత్రే. కాబట్టే దంతసిరికీ ప్రాధాన్యమివ్వాలి. మన హీరోయిన్లూ ఇందులో భాగంగానే తప్పనిసరిగా ‘ఆయిల్‌ పుల్లింగ్‌’ చేస్తామని చెబుతుంటారు.

Updated : 06 Jan 2023 06:08 IST

అందంలో చిరునవ్వుదీ ప్రధాన పాత్రే. కాబట్టే దంతసిరికీ ప్రాధాన్యమివ్వాలి. మన హీరోయిన్లూ ఇందులో భాగంగానే తప్పనిసరిగా ‘ఆయిల్‌ పుల్లింగ్‌’ చేస్తామని చెబుతుంటారు. మీకూ ఆ అలవాటుందా? అయ్యో దాని గురించే తెలియదా... అయితే చదివేయండి.

నోట్లో 600 రకాల సూక్ష్మజీవులుంటాయట. కొన్ని ఆరోగ్యాన్ని కలిగించేవైతే మరికొన్ని పళ్లు పుచ్చడం, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం మొదలైన సమస్యలకీ దారి తీస్తాయి. ఆయిల్‌ పుల్లింగ్‌తో ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఆయుర్వేదంలో దీన్ని ‘గంధుష క్రియ’ అంటారు.

ఎలా చేయాలంటే..

ఉదయాన్నే బ్రష్‌ చేశాక.. రెండు టేబుల్‌ స్పూన్ల నూనెను నోట్లో వేసుకొని 5-10 నిమిషాలు బాగా పుక్కిలించి ఊసేయాలి. పొట్టలోకి పోకుండా చూసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉండి, ఆపై గోరు వెచ్చని నీటితో మరోసారి పుక్కిలించేస్తే సరి. ఇది చేశాక కనీసం పావుగంట సేపు ఏదీ తినకూడదు. నూనెతో పుక్కిలించినప్పుడు నోటిలోపల చర్మానికి గట్టిగా అతుక్కొని ఉండే సూక్ష్మ జీవులు నూనెలోకి వచ్చేస్తాయి.. దుస్తుల నుంచి దుమ్ము కణాలు డిటర్జెంట్‌తో ఉతికేప్పుడు ఎలా వదులుతాయో అలాగన్నమాట! అన్నట్టూ దీన్ని ఖాళీ కడుపుతోనే చేయాలి.

ఏ నూనె మేలు?

కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియల్‌ గుణాలెక్కువ. దీనిలో ఉండే లారిక్‌ యాసిడ్‌ దంత సంరక్షణకీ సాయపడుతుంది. కాబట్టి, ఎక్కువమంది దీన్నే ఎంచుకుంటున్నారు. పుచ్చు పళ్లు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు నువ్వుల నూనె దివ్యౌషధం. కాబట్టి, దీన్నీ ఎంచుకోవచ్చు. నోటి ఆరోగ్యం బాగుంటేనే జీర్ణవ్యవస్థపైనా దుష్ప్రభావం ఉండదు. అంటే.. చిరునవ్వు అందంగా కనిపించడాకీ, ఆరోగ్యానికీ ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రయోజనకరమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్