గర్భిణులకు మేలు.. కాకరకాయ!

కాకరకాయా... చేదు బాబోయ్‌ అనే వారు కొందరైతే, ఆ పేరు చెబితే చాలు ఇష్టంగా తినే వారు ఇంకొందరు. ఏది ఏమైనా ఇందులో మాత్రం పోషకాలు పుష్కలం. అవేంటంటే!

Published : 08 Jan 2023 00:08 IST

కాకరకాయా... చేదు బాబోయ్‌ అనే వారు కొందరైతే, ఆ పేరు చెబితే చాలు ఇష్టంగా తినే వారు ఇంకొందరు. ఏది ఏమైనా ఇందులో మాత్రం పోషకాలు పుష్కలం. అవేంటంటే!

* కాకరకాయలో తక్కువ కెలొరీలు, కార్బొహైడ్రేట్లూ, పీచూ తిన్నవెంటనే కడుపునిండిన భావన కలిగిస్తాయి. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల అధికబరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు, వ్యాధికారకాలైన వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి వీటిలోని పోషకాలకు ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్‌ గుణాలు...క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నిరోధకంగానూ పనిచేస్తుంది.

* రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచే గుణాలు కాకరకాయల్లో మెండుగా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి చక్కెర స్థాయులను నియంత్రించడంలో ఇది ఔషధంలా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియంను పీల్చడంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

* కాకర కాయల్లోని ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిండస్థ శిశువు ఆరోగ్యానికి మంచిది. అలానే గుండె సంబంధిత సమస్యలూ అదుపులో ఉంటాయి.  వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్