పోనీ ఇలా తాగండి!

చలికాలంలో సహజంగానే దప్పికుండదు. అలాగని వదిలేస్తే శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఫలితమే దేనిమీదా ఆసక్తి లేకపోవడం, అలసట.. కొన్నిసార్లు చర్మ, అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు.

Published : 10 Jan 2023 00:06 IST

చలికాలంలో సహజంగానే దప్పికుండదు. అలాగని వదిలేస్తే శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఫలితమే దేనిమీదా ఆసక్తి లేకపోవడం, అలసట.. కొన్నిసార్లు చర్మ, అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. వాటన్నింటి నుంచీ తప్పించుకోవాలా?

* టీ.. ఈ కాలం బోర్‌ కొట్టనిది ఏదైనా ఉందంటే టీనే! వెచ్చగా తాగుతోంటే ఉత్సాహమొచ్చినట్లు అనిపిస్తుందని ఎన్ని సార్లైనా తాగేస్తుంటాం. కెఫిన్‌ శరీరంలోకి అధికంగా చేరినా సమస్యే! బదులుగా చామంతి టీని తాగండి. ఒళ్లు నొప్పులు, నిద్రలేమి, ఆందోళన, కడుపుబ్బరం వంటివి దూరమై చక్కని నిద్రా దరి చేరుతుంది.

* ఇంట్లో వాళ్లకి జలుబు చేసినప్పుడు పాలల్లో పసుపు వేసిస్తుంటాం. ఈ బామ్మల చిట్కా నలతగా ఉన్నప్పుడే కాదు.. రోజూ ప్రయత్నించొచ్చు. శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు జలుబు లక్షణాలను దూరం చేయడం, చక్కని నిద్ర పట్టేలా చేయడంలోనూ సాయపడుతుంది. పాలు శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తే.. పసుపు ఆరోగ్యాన్నిస్తుంది.

* శీతకాలం ఆహారం త్వరగా జీర్ణమవదు. కాబట్టి.. నీటితోపాటు పోషకాలు, ఫైబర్‌ వంటివీ అందేలా చూసుకోవాలి. క్యారెట్‌, బీట్‌రూట్‌, టొమాటో.. వంటి వెజిటబుల్‌ జ్యూసులు, తాజా పండ్ల రసాలకు పుదీనా, కొత్తిమీర వంటివి చేర్చి తీసుకోండి. శరీరానికే కాదు.. ముఖానికీ¨ తేమ అందుతుంది.

* చలి గాలికి నోటికి తిండి సహించదు.. పిల్లలూ వద్దని మారాం చేస్తుంటారు. అందుకే ఓ పూట సూప్‌ని తప్పనిసరి చేయండి. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్