నెలసరిలో తీపి తినాలనిపిస్తే..

మెదడులో సెరటోనిన్‌ అనే రసాయనం మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. అయితే నెలసరిలో ఈస్ట్రోజెన్‌, సెరటోనిన్‌ స్థాయులు పూర్తిగా పడిపోతాయి.

Published : 22 Jan 2023 00:22 IST

మెదడులో సెరటోనిన్‌ అనే రసాయనం మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. అయితే నెలసరిలో ఈస్ట్రోజెన్‌, సెరటోనిన్‌ స్థాయులు పూర్తిగా పడిపోతాయి. దీంతో కార్బొహైడ్రేట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన కేకులు, చాక్లెట్లు, బంగాళాదుంప చిప్స్‌, బిస్కట్లు వంటివి తినాలనిపిస్తుంది. నెలసరిలో కంటినిండా నిద్రపోవాలి. లేదంటే ఈ సమయంలో నిద్రలేమి ఆకలిని నియంత్రించే హార్మోన్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతోపాటు తీవ్ర ఒత్తిడిని కలిగించే  కార్టిసాల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి, ఉప్పు, తీపి, వేపుళ్లు వంటివి తినాలనిపిస్తుంది. రోజూవారీ పనులపై ఆసక్తి తగ్గి, విశ్రాంతి ఆలోచన మొదలవుతుంది.

మంచినీటిని.. చక్కెరస్థాయులు తగ్గడం, క్రోమియం లేదా ఫాస్ఫరస్‌ వంటివి కూడా తీపి తినాలనే కోరికను కలిగిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్య కారణంగా జీవక్రియల వేగం మందగిస్తుంది. శరీరానికి అందించాల్సిన శక్తినివ్వకుండా గ్లైకోజన్‌ కండరాలు, కాలేయంలో గ్లూకోజ్‌గా నిల్వ అవుతుంది. దాంతో కావాల్సినంత గ్లైకోజన్‌ అందక, తక్షణ శక్తి కోసం తీపిపదార్థాలను తీసుకోవాలనిపిస్తుంది. ఇటువంటప్పుడు తీపి తినకుండా గ్లాసు మంచినీళ్లను తాగితే, ఆ ఆహారంవైపు ఏకాగ్రత తగ్గుతుంది.

పోషకాలతో.. చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్‌ను మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించదు. తాజా పండ్లు, గింజలు, కూరగాయలు, గుడ్లు, ఆకుకూరలు, శనగలు వంటివి చేర్చుకుంటూ రోజుకు కొంచెంకొంచెంగా అయిదుసార్లు భోజనాన్ని తీసుకోవాలి. అల్పాహారాన్ని మానేయకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్