కూర్చోవద్దు.. నడవండి!

ఉదయం నుంచి ఉరుకులూ పరుగులూ.. పనంతా అయ్యాక సేదతీరుదామని కూర్చొండిపోతున్నారా? వేళలు మించి పనిచేస్తున్నారా! ఆఫీసుకి వెళ్లినా కుర్చీకి అతుక్కుపోవడమేనా.. అయితే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!

Updated : 23 Jan 2023 13:26 IST

ఉదయం నుంచి ఉరుకులూ పరుగులూ.. పనంతా అయ్యాక సేదతీరుదామని కూర్చొండిపోతున్నారా? వేళలు మించి పనిచేస్తున్నారా! ఆఫీసుకి వెళ్లినా కుర్చీకి అతుక్కుపోవడమేనా.. అయితే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!

దేపనిగా కూర్చొని ఉండిపోవడం విపరీతంగా సిగరెట్‌ తాగేవారికి చేసినంత హాని చేస్తుందట. ఎంత కష్టపడ్డా త్వరగా బరువు తగ్గకపోవడం, విపరీతమైన నడుము నొప్పి, హార్మోన్లలో అసమతుల్యత వంటి వాటికీ దారి తీస్తుందట. ఏం ఫర్లేదు.. ఉదయాన్నే వర్కవుట్లు, ఇంట్లో పనితో బోలెడు వ్యాయామం అంటారా! అవేమీ నిరంతరం కూర్చొని ఉండేవారికి పెద్దగా సాయపడవని పలు నివేదికలు చెబుతున్నాయి. పైగా పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోవడం, చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగడం, మధుమేహం, గుండెజబ్బులకూ కారణమవుతుందట. కాబట్టి..

* ప్రతి అరగంటకోసారి కుర్చీలోంచి లేవడం అలవాటు చేసుకోండి. నాలుగు అడుగులు వేయండి.. లేదూ కనీసం కొద్దిసేపు నించొని తిరిగి పనిలో పడ్డా సరే! ఇంట్లో ఉండేవారికి సేదతీరే పెద్ద మార్గం టీవీనే! దానిముందు చేరితే సమయం ఎలా గడిచిందీ తెలియదు. సమయం చూసుకుంటూ ఉండాలి. రిమోట్‌, ఫోన్‌ వంటివి దూరంగా పెట్టుకోవడం లాంటివి చేస్తే.. అప్పుడప్పుడూ లేవొచ్చు.

* ఫోన్‌ వచ్చినపుడు నడుస్తూ మాట్లాడండి. ఇంట్లో నుంచే పని చేస్తుంటే అప్పుడప్పుడు నిల్చొని పనిచేయండి. మీటింగ్‌ సమయంలోనూ వీలుంటే నిల్చొనో, నడుస్తూనే విషయం వివరించండి.. ఇవన్నీ మేలు చేసేవే!

* కుర్చీలో కూర్చునేప్పుడూ పాదాలు నేలకు ఆనేలా ఉంచుకోవాలి. ముందుకు వంగి పనిచేయడం, ఒకే భంగిమలో గంటలకొద్దీ కూర్చుంటున్నారేమో చెక్‌ చేసుకుంటూ ఉండాలి. కూర్చుంటే ఇన్ని సమస్యలా అని తేలికగా తీసుకోవద్దు. చిన్న విషయాలకే అతిగా స్పందించడం, ఒత్తిడి, ఆందోళన వంటివీ దీని చలవే! కాబట్టి.. లేవండి.. నడవండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్