అందం.. ఆరోగ్యాలకు రేగుపండు

ఔషధగుణాలు పుష్కలంగా ఉండే రేగుపండులోని ఏ, సి విటమిన్లు సహా పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

Updated : 23 Jan 2023 13:30 IST

ఔషధగుణాలు పుష్కలంగా ఉండే రేగుపండులోని ఏ, సి విటమిన్లు సహా పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. రేగుపండు రుచికే కాదు, అందం.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది.

రీరానికి కావాల్సిన పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచి హృద్రోగాలను దరికి చేరనివ్వకుండా ఇది కాపాడుతుంది. మెనోపాజ్‌లోకి అడుగుపెట్టేటప్పుడు డి విటమిన్‌ తగ్గి ఎదురయ్యే కండరాల సమస్యలకు రేగుపండుతో చెక్‌ పెట్టొచ్చు. నెలసరిలో అధికస్రావాన్ని ఈ పండు తీసుకోవడం ద్వారా తగ్గించొచ్చు. రక్తహీనత సమస్యనూ.. దూరం చేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తీసుకొంటే, వీటిలోని కాల్షియం ఫాస్పరస్‌ ఎముకలను దృఢంగా ఉంచి సమస్యకు దూరంగా ఉంచుతాయి. కీళ్లకు సంబంధించిన పలురకాల అనారోగ్యాలకు ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది. గర్భిణిలకెదురయ్యే వికారం, వాంతులు వంటి సమస్యలకు ఇది ఉపశమనాన్నిస్తుంది. 

అందానికి.. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు రేగుపండ్లలో ఉండటంతో చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. దీంతో ముఖచర్మం మెరుపులీనుతుంది. ముఖంపై గీతలు, ముడతలను రానివ్వకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతాయివి. ముందస్తు వృద్ధాప్యఛాయలను దరికి చేరనీయవు. వీటిలోని పోషకాలు శిరోజాలను రాలకుండా పరిరక్షిస్తాయి. వీటిని సీజన్‌లో తీసుకొంటే, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. కొవ్వు, కెలోరీలు తక్కువగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంవల్ల అధికబరువు సమస్య దరి చేరదు. అలాగే రక్తంలో గ్లూటానిక్‌ ఆమ్లాన్ని విడుదలయ్యేలా చేసి మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి. రక్తప్రసరణ సజావుగా జరిగి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దరిచేరవు. నిద్రలేమికి దూరంగా ఉండొచ్చు. కాలేయానికి సంబంధించిన సమస్యలకూ.. దూరంగా ఉండొచ్చు. వీటిలోని పీచు జీర్ణాశయం పనితీరును మెరుగుపరిచి అజీర్తిని తగ్గిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్