ప్రశాంతమైన మనసుకు..

మీకెప్పుడైనా ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించా అన్న సందర్భం ఉందా? ఇల్లు, ఆఫీసు పని, పిల్లల ఆలనాపాలనా... ఇలా బోలెడు పనులు.

Published : 24 Jan 2023 00:55 IST

మీకెప్పుడైనా ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించా అన్న సందర్భం ఉందా? ఇల్లు, ఆఫీసు పని, పిల్లల ఆలనాపాలనా... ఇలా బోలెడు పనులు. అందుకు సమయమేది అంటారా! తాజాగా ఓ విదేశీ సంస్థ అధ్యయనంలో మన ఆడవాళ్ల నుంచి ఎక్కువగా ఇలాంటి సమాధానమే వచ్చిందట.  మరి ఇలాగైతే ప్రమాదం కదా!

* రోజూ కొద్దిసేపు ధ్యానం అలవాటు చేసుకోండి. దీనికీ సమయం కుదరదు అంటారా? పోనీ మనసు చిరాగ్గా ఉన్నా.. కోపం దరిచేరుతున్నా దీన్ని ఆశ్రయించేయండి. కళ్లు మూసుకొని శ్వాస మీద దృష్టి నిలపగలిగితే చాలు. వీలు కాకపోతే ఏదైనా మంత్రాన్ని చదువుకున్నా సరే! మనసు తేలిక పడుతుంది.

* చుట్టూ చూడండి.. కనిపించిన వస్తువు పేరునల్లా మనసులో మననం చేసుకోండి. ఇలా కొద్దిసేపు చేసినా.. ఆందోళన తగ్గుతుంది.

* బొమ్మలకు రంగులు వేయడం.. చిన్నతనంలో ఎంతో ఇష్టమైన వ్యాపకం కదా! దీన్ని ప్రయత్నించేయండి. చిన్న పిల్లల పనిగా తోచినా.. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. తోచిన బొమ్మలు గీయడం.. వాటికి రంగులు వేయడం మీలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ధ్యాసంతా చేతి కదలికలు, వేసే బొమ్మమీదే లగ్నమై.. మనసును తేలిక పరుస్తుందట. పెయింటింగ్‌ను ప్రయత్నించినా ఇక్కడ లాభమే.

* ఒకే ప్రాంతంలో లేదా గంటలకొద్దీ ఒకేచోట కూర్చున్నా.. మెదడు అతిగా ఆలోచిస్తుందట. అలసిపోయినట్లుగా అయ్యి ఒత్తిడికి దారి తీస్తుంది. కాసేపు నడవండి. గదిలో నాలుగడుగులు వేసినా సరే! వీలుంటే మొక్కల మధ్య సేద తీరితే ఇంకా మంచిది. మొక్కలు, వాటి పచ్చదనం మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

* ఒత్తిడి ఎక్కువైతే కొందరు అతిగా తినేస్తుంటారు. ఇది అతి బరువుకు దారితీస్తుంది. కానీ తినే ప్రతి ముద్దనీ నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినండి. ఇక చాలనిపించగానే ఆపేయండి. అప్పుడే తిన్న దాన్నీ ఆస్వాదించగలరు. మనసూ స్థిమిత పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్