ఒంటరిగా కాకుంటే.. జంటగా చేయండి!

ఎక్కువ మంది మహిళలు తీసుకునే ఆహారంపైనే కాదు, వ్యాయామం చేయడంపైనా దృష్టిపెట్టరు. ఇందుకు సమయం దొరకడం లేదనేదే మొదటి కారణం.

Published : 30 Jan 2023 00:03 IST

ఎక్కువ మంది మహిళలు తీసుకునే ఆహారంపైనే కాదు, వ్యాయామం చేయడంపైనా దృష్టిపెట్టరు. ఇందుకు సమయం దొరకడం లేదనేదే మొదటి కారణం. కానీ, కాస్త మనసు పెడితే.... ఇదేమంత కష్టమైన విషయం కాదు. అదెలాగంటే...

* ఇంటిపనులూ, ఆఫీసు విధులతో తలమునకలయ్యే వారు...సాయంత్రం పూట వ్యాయామం చేయడం కాస్త కష్టమైన విషయమే. ఎందుకంటే అప్పటికే ఒంట్లోకి నిస్సత్తువ చేరిపోతుంది. దాంతో కాస్త సేదతీరాలనిపిస్తుంది. ఆ పరిస్థితి వల్ల వ్యాయామాన్నే వాయిదా వేయాలంటే...కుదరదు. అందుకే ఆ సమయం కచ్చితంగా ఉదయమే ఉండేలా చూసుకోండి. ఇలా కనీసం నాలుగైదు వారాలు కొనసాగించగలిగితే దాన్నో అలవాటుగా మార్చుకోగలుగుతారు.

* వ్యాయామం చేయాలన్న ఆలోచనకు మీకంటూ ప్రత్యేక కారణం ఉంటే... దానికి అనుగుణంగా మీ వ్యాయామ ప్రణాళిక నిర్ణయించుకోండి. నడుం నొప్పి, అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు, నెలసరి క్రమం తప్పడం...వంటివెన్నో ఇందులో ఉండొచ్చు. వీలైతే ఇందుకోసం వ్యాయామ నిపుణుల సాయమూ తీసుకోండి. దాంతో మీరు కోరుకున్న ప్రయోజనాలు తొందరగా అందుతాయి. శ్రమ చేయాలన్న ఉత్సాహమూ పెరుగుతుంది.

* కొందరికి ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు వెనకనుంచి పదే పదే చెప్పాలి. కానీ, వ్యాయామం విషయంలో ఆ పరిస్థితి రాకుండా మీకు మీరే సెల్ఫ్‌ మోటివేషన్‌ చేసుకోండి. రోజూ మీరెలా వ్యాయామాలు చేయాలో ఆ భంగిమలూ, సంబంధిత చిత్రాలను గోడపై మీకు కనిపించేలా అతికించుకోండి. పదే పదే మీ కళ్ల ముందు కనిపిస్తే మీలోనూ పట్టుదల పెరిగిపోతుంది.

వ్యాయామం చేయాలనుకోవడమే కానీ... పట్టుమని పదినిమిషాలు కూడా కసరత్తులు చేయలేకపోతున్నారా? అయితే మీరు ఒంటరిగా కాకుండా జంటగా ఆ పని చేయండి. అది భాగస్వామే కానక్కర్లేదు స్నేహితురాలినీ తోడు తీసుకోవచ్చు. అప్పుడు ఇద్దరూ ఉత్సాహంగా చేసేయగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్