ఆ నొప్పికి.. పసుపు పాల మంత్రం

పాలల్లో పసుపు వేసి కాచి తాగితే మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. గోల్డెన్‌ మిల్క్‌గానూ పిలిచే దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.

Published : 31 Jan 2023 00:37 IST

పాలల్లో పసుపు వేసి కాచి తాగితే మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. గోల్డెన్‌ మిల్క్‌గానూ పిలిచే దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.

* బరువు తగ్గటానికి అనేక వ్యాయామాలు చేస్తాం. వాటితో పాటు పసుపు పాలు కూడా తీసుకుంటే తొందరగా అనుకున్న ఫలితం పొందొచ్చు. గోరువెచ్చని పసుపు పాలను రోజూ రాత్రి వేళ తాగితే చక్కగా నిద్ర పడుతుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. 

* మెనోపాజ్‌ దశలో క్యాల్షియం తగ్గటం వల్ల కీళ్లనొప్పులు అధికంగా బాధిస్తాయి. అలాంటి సమయంలో క్రమం తప్పకుండా రోజూ ఓ గ్లాసు పసుపుపాలు తీసుకుంటే కీళ్లనొప్పులు దరిచేరవు. ఈ పాలల్లో ఉండే సుగుణాలు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి.

* పసుపు పాలల్లో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్ట్రిక్‌ సమస్యలకు స్వస్తి చెప్తాయి.

* ఈ బంగారు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్‌, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లూ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌కారక కణాలను వృద్ధి చెందకుండా చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచి నెలసరిని క్రమబద్ధం చేస్తాయి.

కాచేద్దాం... గ్లాసు పాలల్లో అరచెంచా పసుపు  వేసి తక్కువ మంట మీద పొంగు వచ్చే వరకూ మరిగించాలి. మార్కెట్లో దొరికే పసుపు కంటే మనం ఇంట్లో పసుపు కొమ్ములతో చేసుకున్నదైతే ఇంకా మంచిది. దీంట్లో తీపి కోసం పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె ఉపయోగిస్తే ఇంకా మేలు.

* నెలసరి నొప్పులు తగ్గాలంటే...రోజూ  గ్లాసు పసుపు పాలను తాగి చూడండి. ఫలితం కనిపించడమే కాదు.. అనేక అనారోగ్య సమస్యలూ దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్