అది మంచిది కాదమ్మా!

‘స్ట్రిక్ట్‌ డైట్‌లో ఉంది’ వేడుకల సమయంలో ఈ మాట ఎన్నిసార్లు వినుంటాం? సన్నగా, నాజూగ్గా ఉండాలనుకునే ఈ తరం అమ్మాయిలు ఎక్కువమంది అనుసరించే పద్ధతే ఇది! కానీ ఈ తీరంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

Updated : 01 Feb 2023 04:06 IST

‘స్ట్రిక్ట్‌ డైట్‌లో ఉంది’ వేడుకల సమయంలో ఈ మాట ఎన్నిసార్లు వినుంటాం? సన్నగా, నాజూగ్గా ఉండాలనుకునే ఈ తరం అమ్మాయిలు ఎక్కువమంది అనుసరించే పద్ధతే ఇది! కానీ ఈ తీరంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

* వీలైనంత త్వరగా బరువు తగ్గేయాలని ఆలోచిస్తుంటారు చాలామంది. దీనికోసం క్రాష్‌ డైట్‌లు, విపరీతమైన వ్యాయామాలు చేసేస్తుంటారు. అమ్మాయిల దృష్టి అయితే పూర్తిగా తిండి తగ్గించడంపైనే! ఆరోగ్యంగా బరువు తగ్గడమంటే ఒంట్లో అధికంగా చేరిన కొవ్వు పోవాలి.. కండ కరగొద్దు. అలా బరువు తగ్గినా మెటబాలిజం దెబ్బతిని అనారోగ్యాలు చుట్టుముడతాయి.

* శరీర పనితీరుకి ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యమైన కొవ్వులు, విటమిన్లు రోజూ తగిన మొత్తంలో కావాలి. డైట్‌, కెలోరీల కోత పేరుతో డెయిరీ, కొవ్వుపదార్థాలు వంటివి పూర్తిగా పక్కన పెట్టేస్తారు. కానీ దీనివల్ల జీర్ణసమస్యలు, తీవ్ర అలసట, శక్తినంతా కోల్పోయినట్లుగా నిస్సత్తువగా ఉండటం వంటివి మొదలవుతాయి. ఎముకల్లో పట్టూ తగ్గుతుంది. తరచూ జబ్బుల పాలిట పడటమే కాదు. చర్మం నిర్జీవంగా అవ్వడం, కురులు రాలడం వంటి సమస్యలూ వస్తాయి.

* పూర్తిగా పండ్ల రసాలపైనే ఆధారపడుతున్నారా? మంచిది కాదు. బరువు తగ్గుతారు కానీ.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం జరగొచ్చు.

* శరీరం పట్ల మీరు చూపే ఈ కఠినత్వం మానసిక సమస్యలకూ దారితీయగలదు. తగ్గామన్న సంబరం మెదడుకు భారంగా తోయొచ్చు. దీంతో తిండి మీదే విరక్తి కలిగించే అనోరెక్సియాకీ దారి తీసే ప్రమాదం ఉంది. శరీరాన్ని కష్టపెడుతూకాక ఇష్టంగా తగ్గే మార్గాలను చూడండి. అప్పుడే ఆ ప్రయాణం భారంగా కాక ఆహ్లాదంగా అనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్