పనిలో పడితే.. అంతేనా!

ఆఫీసులో కుర్చీకి అతుక్కొని పనిచేసే జాబితాలో మన ఆడవాళ్లే ఎక్కువగా ఉంటారు. లేవడానికి మొహమాట పడటం, పని పూర్తయితే త్వరగా ఇంటికెళ్లొచ్చన్న తొందర కారణమేదైతేనేం.. త్వరగా కదలం.

Published : 12 Feb 2023 00:22 IST

ఆఫీసులో కుర్చీకి అతుక్కొని పనిచేసే జాబితాలో మన ఆడవాళ్లే ఎక్కువగా ఉంటారు. లేవడానికి మొహమాట పడటం, పని పూర్తయితే త్వరగా ఇంటికెళ్లొచ్చన్న తొందర కారణమేదైతేనేం.. త్వరగా కదలం. సాయంత్రానికి ఒళ్లంతా నొప్పులొచ్చేస్తాయి కదూ! ఈ చిన్న వ్యాయామాలు ప్రయత్నించేయండి.


ఆఫీసు వేళలు ముగిసేనాటికి నడుము నొప్పి గమనించారా? గంటలకొద్దీ కుర్చీకే పరిమితమవడమే కారణం. కుర్చీలో ముందుకు కూర్చొండి. ఒక కాలిని మామూలుగా ఉంచి, మరోదాన్ని చాచాలి. ఇప్పుడు వంగి పాదాల వేళ్లను పట్టుకునే ప్రయత్నం చేయండి. వెన్ను వంగకుండా చూసుకోవాలి. వేళ్లు అందుకోవడం సాధ్యం కాకపోతే కాలిని పట్టుకొని కొంతసేపు ఉంటే సరి. నడుము నొప్పి దూరమవడమే కాదు.. పాదాల కండరాలకూ విశ్రాంతి.


తదేకంగా పనిచేశాక మెడ నొప్పిగా అనిపించడం మామూలే. నిటారుగా కూర్చొని రెండు చేతులతో కుర్చీని పట్టుకోవాలి. తలను ఓవైపు భుజానికి తగిలేలా కొన్ని సెకన్లు ఉంచాలి. తర్వాత మరోవైపు అలానే చేయాలి. ఇది మెడ కండరాలను విశ్రాంతిపరచడమే కాదు.. పటిష్టంగానూ చేస్తుంది.


‘ఏమో తెలియదు’ అనడానికి తెలియకుండానే భుజాలు ఎగరేస్తుంటాం గమనించారా? ఆ భంగిమలో కొద్దిసేపు ఉండి చూడండి. భుజాలు పట్టేసినట్లు ఉండటం, మెడ, భుజాల మధ్య నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం దొరుకుతుంది.


చేతులు రెండూ ముందుకు చాచండి. ఒక చేతిని వెనక్కితిప్పి, మరో చేత్తో వేళ్లని వెనక్కి లాగినట్లుగా చేయాలి. నిమిషం పాటు అలా ఉంచి, మరో చేతిని అలాగే చేయాలి. గంటలపాటు సిస్టమ్‌పై పనిచేస్తోంటే చేతులపై ప్రభావం పడుతుంది. ఈ వ్యాయామం చేతి జాయింట్లకు విశ్రాంతినిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్