Published : 16/02/2023 00:58 IST

బరువు తగ్గించే సొరకాయ!

చలిగాలుల వేగం తగ్గి... నెమ్మదిగా వేడి విజృంభిస్తోంది. క్రమంగా ఒంట్లో డీహైడ్రేషన్‌ మొదలవుతోంది. దీన్ని అదుపులో ఉంచడానికి ఈ కాలంలో సొరకాయను విరివిగా తినాలంటారు పోషకాహార నిపుణులు.

* ఈ కాలంలో పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదు. కెలొరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ కూరగాయ అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. అతి దాహాన్ని అదుపు చేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా తినేయొచ్చు. ఇందులోని పీచు జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది.

* శరీరానికి హానిచేసే శాచ్యురేటెడ్‌ కొవ్వు, కొలెస్ట్రాల్‌ ఇందులో ఉండవు. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, రైబోఫ్లెవిన్‌, జింక్‌, థయమిన్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బాలింతలకూ, జ్వరం వచ్చి తగ్గిన వ్యక్తులకూ దీన్ని పత్యంగా పెడతారు.

* ఒత్తిడితో పోరాడేవారు... అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. ఇందులోని పొటాషియం ఈ సమస్యల్ని నియంత్రించి మెదడుని ఉత్తేజపరుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని