ఆరంభ శూరత్వం కాదు..

రమణి బరువు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ. తగ్గాలని వ్యాయామాలు చేయడం మొదలుపెట్టి, వారానికే మానేస్తుంటుంది.

Published : 26 Feb 2023 00:16 IST

రమణి బరువు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ. తగ్గాలని వ్యాయామాలు చేయడం మొదలుపెట్టి, వారానికే మానేస్తుంటుంది. సన్నబడలేకపోతున్నానంటూ.. వేదనకు గురవుతుంది. అలాకాకుండా నిత్యం ఫిట్‌గా ఉండాలంటే పాటించాల్సిన నియమాలను నిపుణులు చెప్పుకొస్తున్నారిలా..

మొదలుపెట్టేముందే కష్టపడొద్దు. ముందు వారానికోరోజు వ్యాయామాల కోసం  కేటాయించుకోవాలి. ప్రారంభంలోనే రోజూ కష్టపడటానికి సిద్ధపడితే, నాలుగురోజలకే కండరాలు అలసి, ఒళ్లు నొప్పులు మొదలవుతాయి. వ్యాయామాలపై ఆసక్తి దూరమవుతుంది. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం. అందుకే ముందుగా తక్కువ సమయాన్ని కేటాయించుకొని క్రమేపీ పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే శరీరం, మనసూ రెండూ వ్యాయామాలకు అలవాటుపడతాయి.

రోజూవారీ ..

తర్వాత రెండు లేదా మూడుసార్లకు మార్చాలి. అలాగని పరుగు, నడక, ఫిట్‌నెస్‌ వ్యాయామాలంటూ అన్నీ ఒకేరోజు చేయొద్దు రోజుకొకటి కేటాయించుకోవాలి. ప్రతిరోజూ జీవనశైలిలో వ్యాయామాలనూ భాగం చేసుకోవాలి. ఆ రోజు పరుగు లేదా నడక. వీలుకాకపోతే ఇంట్లోనే పదినిమిషాలపాటు వ్యాయామం. ఈ నియమం శరీరానికి క్రమశిక్షణ నేర్పుతుంది. ఆరోగ్యంగా అనిపిస్తూ.. ఫిట్‌గా ఉండే ఫీలింగ్‌నిస్తుంది. అంతేకాదు.. రోజంతా ఉత్సాహంగా ఉండేలా మనసును మార్చేస్తుంది. ఇవన్నీ క్రమేపీ వ్యాయామంపై ఆసక్తిని పెంచి మనకు మనంగానే దీన్ని రోజూవారీ అలవాటుగా చేసుకొంటాం. 

వార్మ్‌అప్‌..

వర్కవుట్‌కు ముందు వార్మ్‌అప్‌ తప్పనిసరి. దీనివల్ల కండరాల అలసట, అనుకోని ప్రమాదాలు జరగడం వంటివి చోటు చేసుకోవు. దీంతో ఫిట్‌నెస్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాగే వర్కవుట్‌ పూర్తయిన వెంటనే చిన్నచిన్న స్ట్రెచ్‌లు ఒక్కోదాన్నీ అరనిమిషంపాటు చేయడం మంచిది. దీంతో కండరాలన్నీ ఫ్రీ అవుతాయి. శరీరం యధాస్థితికి వస్తుంది. అలసటగానూ అనిపించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్