రోజూ గుప్పెడు మొలకలు...!

శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు. పోషకాలు పుష్కలంగా అందాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా.. రోజూ కాసిన్ని మొలకలు తినండి.

Published : 10 Mar 2023 00:01 IST

శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు. పోషకాలు పుష్కలంగా అందాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా.. రోజూ కాసిన్ని మొలకలు తినండి.

హారపుటలవాట్లు, జీవనశైలి కారణాలేవైతేనేం... మహిళలందరూ హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం...లాంటి ఎన్నో సమస్యలకు మూలం. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పెడు మొలకల్ని తినాలి. పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటూ ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే సరి. ఇవి విటమిన్లూ, ఖనిజాలూ, ప్రొటీన్‌ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందిస్తాయి.

* మెదడుకు రక్తం చక్కగా సరఫరా చేయడంలోనూ మొలకల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడేవారు... మొలకల్ని తీసుకోవడం మంచిది. వీటిల్లో దొరికే మెగ్నీషియం, క్యాల్షియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి.

* బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత తీసుకుంటే అంత మేలు. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్‌, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ముఖ్యంగా జింక్‌ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్