ఉదయాలన్నీ.. ఉల్లాసంగా!

రోజూ ‘అప్పుడే తెల్లారిందా..’ అనుకుంటూ లేవడమేనా? అలాకాకుండా ఉల్లాసంగా నిద్రలేచి.. అంతే ఉత్సాహంగా రోజంతా గడిపేయాలనుందా! అయితే ఈ చిన్ని మార్పులు చేసుకోమంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్రది ప్రధాన పాత్ర. కాబట్టి 7 గంటల నిద్ర.. నియమం పెట్టుకోండి. అలాగని నచ్చిన వేళలను ఎంచుకోవద్దు.

Published : 13 Mar 2023 00:13 IST

రోజూ ‘అప్పుడే తెల్లారిందా..’ అనుకుంటూ లేవడమేనా? అలాకాకుండా ఉల్లాసంగా నిద్రలేచి.. అంతే ఉత్సాహంగా రోజంతా గడిపేయాలనుందా! అయితే ఈ చిన్ని మార్పులు చేసుకోమంటున్నారు నిపుణులు.

ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్రది ప్రధాన పాత్ర. కాబట్టి 7 గంటల నిద్ర.. నియమం పెట్టుకోండి. అలాగని నచ్చిన వేళలను ఎంచుకోవద్దు. రోజూ ఒకే సమయానికి పడుకోవడం లేవడం చేయాలి. అప్పుడే శరీరానికీ ఆరోగ్యకరమైన శైలి అలవాటవుతుంది. పడుకొనే ప్రదేశమూ నీట్‌గా ఉండాలి. తరచూ పక్క, కప్పుకొనే దుప్పట్లు, దిండు గలీబులు మారుస్తూ ఉండండి. సుఖనిద్ర ఖాయం.

పడుకోవడానికి గంట ముందు గ్యాడ్జెట్లను దూరంగా ఉంచండి. వాటి నుంచి వెలువడే నీలికాంతి నిద్రను దూరం చేస్తాయి. ఫలితమే లేచాక చిరాకు వంటివి. బదులుగా పుస్తకం చదవడమో, ఉల్లాసంగా సాగే మ్యూజిక్‌ వినడమో చేయండి. నాణ్యమైన నిద్రను చేరువ చేస్తాయివి.

మరుసటి రోజు చేయాల్సినవి.. చిన్నా, పెద్దా అన్నీ ఒక జాబితాగా రాసి పెట్టుకోండి. ఆరోజు ఎలా గడవాలి అనుకుంటున్నారన్నదీ పైన రాయండి. ఇవి పూర్తి చేయాలన్న ప్రేరణని ఇవ్వడమే కాదు.. ముందే ప్లాన్‌ చేసుకు న్నామన్న భావన సుఖనిద్రని ప్రసాదిస్తాయట. దీంతో ఉల్లాసంగా నిద్ర లేవొచ్చు.

లేవగానే పనిలో పడిపోవద్దు. ఓ పావుగంట యోగా, చల్లగాలికి నడక, చిన్నపాటి వ్యాయా మం తప్పక చేయాలి. శరీరంతోపాటు మెదడు చురుగ్గా తయారవుతుంది. ఎంత తీరిక లేకుండా ఉన్నా దీన్ని తప్పక కొనసాగించాలి.

తర్వాత చేద్దాం లే అన్న పద్ధతే సగం కంగారుకి మూలం. దేన్నీ వాయిదా వేయొద్దు. ముందు ఇది చేసి పక్కన పడేద్దాం అనుకుంటూ సాగండి. టెన్షన్‌ మీ దరి చేరదు. పూర్తిచేసిన పని మనసుకు తెలియకుండానే ప్రశాంతతను ఇస్తుంది. మీ రోజును ఇలా ప్లాన్‌ చేసుకోండి. ఉత్సాహంగా లేవడం ఖాయం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్