అమ్మకి.. ఆరోగ్యంగా!

కడుపుతో ఉన్నప్పుడు సాధారణంగానే నీరసంగా అనిపిస్తుంటుంది. దీనికితోడు ఏవేవో రుచులు తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరమైనవైనా కొన్ని సహించవు. అలాగని అశ్రద్ధ వహిస్తే ఆమెకే కాదు.. కడుపులోని బిడ్డకీ పోషకాలు అందవు.

Published : 14 Mar 2023 00:16 IST

కడుపుతో ఉన్నప్పుడు సాధారణంగానే నీరసంగా అనిపిస్తుంటుంది. దీనికితోడు ఏవేవో రుచులు తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరమైనవైనా కొన్ని సహించవు. అలాగని అశ్రద్ధ వహిస్తే ఆమెకే కాదు.. కడుపులోని బిడ్డకీ పోషకాలు అందవు. మరెలా.. వీటిని ప్రయత్నించేయండి.

* తాజా పండ్లు కావాల్సిన పోషకాలను అందివ్వడమే కాదు.. నీరసాన్నీ తరిమేయగలవు. అరటి, యాపిల్‌, ఆరెంజ్‌.. అన్నింటినీ కొద్దికొద్దిగా సలాడ్‌లా చేసుకొని తీసుకోండి. ఒకటే తింటున్నామన్న భావన ఉండదు. కాస్త మిరియాలపొడి కానీ తేనె కానీ జతచేస్తే అదనపు రుచి కూడా!

* పెరుగు నుంచి పోషకాలే కాదు క్యాల్షియం, ప్రోబయాటిక్స్‌ అందుతాయి. ఈ సమయంలో ఏర్పడే అజీర్తికీ చక్కని మందు. బెర్రీస్‌, మామిడి, స్ట్రాబెర్రీ ఇలా నచ్చినవి తెచ్చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోండి. తాజాగానూ ఉంటుంది. అనారోగ్య సమస్య ఉండదు.

* కడుపుతో ఉన్నప్పుడు ప్రతి చిన్న వాసనా ఇట్టే తెలిసిపోతుంది. సగం ఆహారంపై విరక్తికి ఇదీ కారణమే! అయిష్టం కలుగుతోన్న జాబితాలో పాలు ఉన్నాయా? క్యాల్షియం అందాలంటే పాలు తీసుకోక తప్పదు. కాబట్టి, దానిలో తేనె, వేయించిన నట్స్‌ పొడి, పండ్లు.. ఇలా ఏవో ఒకటి కలుపుకొని తాగి చూడండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

* టిఫిన్‌, ఆహారం.. అరగడానికి సమయం పడుతుంది. చిరుధాన్యాలతో చేసిన అటుకుల్లాంటివి దొరుకుతున్నాయి. వీటిని నేరుగానో, కాస్త నూనెలేకుండా వేయించో, పాలల్లో వేసుకొనో తింటే సరి. నట్స్‌, సీడ్స్‌, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ట్రయల్‌ మిక్స్‌లూ దొరుకుతున్నాయి. వీటిని పాలతో కలిపి తీసుకున్నా మంచిదే.

* ఈ సమయంలో కూరగాయలు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి.ఏదైనా ఒక ఆకుకూర, రెండు మూడు కూరగాయలు కలిపి సూప్‌లా చేసుకొని తీసుకున్నా సరే!. పొట్ట బరువనిపించదు. విటమిన్లూ అందుతాయి. అరుగుదల సమస్యా ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్