కాబోయే అమ్మలూ.. ఆరోగ్యంగా తింటున్నారా?

వేసవి వచ్చేసింది. తల్లి కాబోతున్నవారు తీసుకొనే ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోతే ఆ ప్రభావం తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా పడుతుంది.

Published : 19 Mar 2023 00:11 IST

వేసవి వచ్చేసింది. తల్లి కాబోతున్నవారు తీసుకొనే ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోతే ఆ ప్రభావం తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా పడుతుంది. కాబట్టి...

తాజా ఆహారం, పండ్లనే తీసుకోవాలి. నిల్వ వాటికి దూరంగా ఉంటే మంచిది. సీజన్‌లో లభ్యమయ్యే పుచ్చకాయ, నారింజ, కమలా, ద్రాక్ష పండ్లను రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. పండ్ల సలాడ్లతో విటమిన్లు, ఖనిజ లవణాలు మెండుగా అందుతాయి. పీచు పుష్కలంగా ఉండే ఇవి జీర్ణశక్తినీ పెంచుతాయి. శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరవు.

రంగురంగుల వాటితో.. ఆకుకూరలతోపాటు క్యారెట్‌, టొమాటో, కీరదోస వంటి రంగురంగుల కూరగాయలన్నింటినీ కలిపి చేసే సలాడ్స్‌ గర్భం దాల్చిన వారికి సూపర్‌ఫుడ్స్‌ లాంటివి. ఇవి పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆకుకూరల్లోని ఫోలిక్‌ యాసిడ్‌ ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. పెరుగులో గర్భస్థ శిశువు ఎదుగుదలకు అవసరమయ్యే పొటాషియం, కాల్షియం, ప్రొటీన్లు, బీ12 విటమిన్‌ వంటివి ఉంటాయి. రోజూ కప్పు పెరుగు తప్పక తీసుకోవాలి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి, నీటి శాతాన్ని సమన్వయం చేస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వ్యాధినిరోధక శక్తిని పెంచి సీజనల్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

నీటిలో.. ఈ సమయంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. గర్భస్థశిశువు ఎదుగుదలలో, కొత్తకణాల పెరుగుదలకు దోహదపడుతుంది. నెలలు నిండకుండా ప్రసవమయ్యే సమస్యను నిరోధిస్తుంది. పుదీనా ఆకులు వేసిన నీటిని తీసుకుంటే శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి తప్పించడమే కాకుండా చల్లగానూ ఉంచుతుంది. వీటితోపాటు పండ్లరసాలు, సూప్స్‌ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. తేలికగానూ జీర్ణమై, తక్షణ శక్తినిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్