ఇవి తిందాం.. చల్లగా ఉందాం..

ఇంటి పనీ, ఆఫీసు పనీ అంటూ  మన ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టం. దాంతో వేసవిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలూ ఉన్నాయి. అలా కాకుండా నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.. పెరుగులో విటమిన్‌ ఎ, బి- 12, క్యాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి.

Published : 24 Mar 2023 00:40 IST

ఇంటి పనీ, ఆఫీసు పనీ అంటూ  మన ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టం. దాంతో వేసవిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలూ ఉన్నాయి. అలా కాకుండా నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు..

పెరుగులో విటమిన్‌ ఎ, బి- 12, క్యాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. దీంతో శరీరానికి కావాల్సిన షోషకాలను ఇది ఎక్కువ మోతాదులో ఇస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిని అదుపులో ఉంచడమే కాక చర్మం నిగారించేలా చూస్తుంది. వేసవిలో పెరుగు రోజూ తీసుకుంటే ఎండ తాపం నుంచి కాపాడుతుంది.

వడదెబ్బ తగలకుండా కాపాడేందుకు ముందు వరుసలో ఉండేవి కొబ్బరినీళ్లు. వీటిలో ఉండే ఫాస్ఫరస్‌, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉంచడమే కాకుండా కిడ్నీలో రాళ్లనూ కరిగిస్తుంది. కొబ్బరినీళ్లు ఎలక్ట్రొలైట్లతో నిండి ఉండటం వలన మంచినీళ్ల కంటే ఇవే మేలని నిపుణులు అంటున్నారు.

వేసవిలో వేపుళ్లు, మసాలా ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మాంసాహారం తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. దానికి బదులుగా ఎక్కువ శాతం ఆకుకూరలకే ప్రాధాన్యం ఇస్తే శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది, ఆహారం తేలికగా కూడా అవుతుంది.

కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్లు తీసుకుంటే వేసవి తాపం దరిచేరదు. కావాల్సిన పోషకాలన్నీ అందటమే కాకుండా, శరీరాన్ని చల్లగా ఉండేలా చేస్తాయి. పండ్ల రసాలు వేసవిలో ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లో పంచదారకు బదులుగా బెల్లం వినియోగిస్తే మంచిదంటున్నారు నిపుణులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్