నడక మంచిదే..

మనలో ఎక్కువ మంది ఆఫీసు, ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ వారి ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోరు. తీరిక లేదంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

Published : 30 Mar 2023 00:26 IST

మనలో ఎక్కువ మంది ఆఫీసు, ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ వారి ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోరు. తీరిక లేదంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సమయం లేకపోతే కనీసం నడవండి అంటున్నారు నిపుణులు..

కస్మికంగా బరువు పెరగటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. బరువు తగ్గించుకొని శరీరాన్ని మంచి ఆకృతిలోకి తీసుకురావాలంటే జిమ్‌కి వెళ్లే సమయం ఉండదు. వాకింగ్‌తో కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో తెలుసుకుందాం.

నిటారుగా..  వాకింగ్‌ చేసేందుకు ముందు అయిదు నుంచి పది నిమిషాలు వార్మప్‌ చేయాలి. నిటారుగా నిలబడి నడవటం వల్ల ఎక్కువ దూరం నడిచినా అలసట ఉండదు. చేతులు ముందుకూ వెనుకకూ కదుపుతూ నడవాలి. నడిచేటప్పుడు పాదం మొత్తం నేలకు తాకేలా చూసుకోవాలి.

తేలికగా.. ఒకేసారి వేగంగా నడిచేయాలి అనుకోవద్దు. పారంభంలో నెమ్మదిగా నడిస్తేనే మంచిది. ఇబ్బందిగా అనిపించినప్పుడు కొంత సమయం కూర్చోండి. రోజూ 10 నిమిషాలు పెంచుకుంటూ వెళ్లండి. చివరగా గంట వరకూ నడిచేలా చూసుకుంటే సరి. అలా రోజూ అయిదు మైళ్ల దూరం, 400 కెలొరీలు ఖర్చు అవ్వాలనే లక్ష్యం పెట్టుకోండి. ఇలా నడవటం వల్ల శరీరంలో అనవసరంగా పేరుకున్న కొవ్వు చెమట రూపంలో బయటకు వస్తుంది. బయటకు వెళ్లటం కుదరనప్పుడు ఇంటిడాబా పైన, కారిడార్‌లో చేసినా మంచిదే.

సౌకర్యంగా.. వాకింగ్‌కు వెళ్లేందుకు ధరించిన దుస్తులు, చెప్పులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన వాకింగ్‌ షూ ఎంచుకోవడం మరచిపోవద్దు. వీలుంటే పార్క్‌ వంటి పచ్చని ప్రదేశాలు వాకింగ్‌ కోసం ఎంపిక చేసుకోండి. ఆహ్లాదకరంగా ఎంత దూరమైనా ఆస్వాదిస్తూ నడుస్తారు. వాకింగ్‌ వల్ల బరువు తగ్గడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించొచ్చు. నెలసరి సమయంలో వచ్చే ఒళ్లు నొప్పులు కూడా క్రమంగా అదుపులోకి వస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్