ఆరోగ్యకరమైన కురులకు..

ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పౌష్టికాహార లోపం ఇలా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంటుంది.  కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యకరమైన కురులను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Published : 30 Mar 2023 00:26 IST

ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పౌష్టికాహార లోపం ఇలా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంటుంది.  కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యకరమైన కురులను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే...

కరివేపాకు నూనె.. కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి వేడిచేయాలి.  చల్లారాక ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి బాగా మర్దన చేయాలి. అరగంట తర్వాత తలంటుకుంటే సరి. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్‌, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

గుంటగలగర నూనెతో... ఇందులో ఉండే ఐరన్‌, విటమిన్‌ ఇ, మెగ్నీషియం, కుదుళ్లను బలపరచి జుట్టు రాలకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు ఈ నూనెతో మర్దన చేసి మర్నాడు ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లి రసంతో... దీనిలో ఉండే సల్ఫర్‌ కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి జుట్టుని బలంగా చేస్తుంది. కొబ్బరి నూనె లేదా మందార పువ్వులతో కలిపి జుట్టుకు రాసి అరగంట తర్వాత కడిగేస్తే కురులు మృదువుగా మారడమే కాదు చిట్లే సమస్య తగ్గుతుంది.

ఉసిరితో... ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఉసిరి పొడిలో కొంచెం నీళ్లు కలిపి , జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకుంటే ఒత్తుగా పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే నిగనిగలాడే కురులు సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్