Published : 01/04/2023 00:17 IST

వేడిగా.. చల్లబరుస్తాయ్‌!

వేసవిలో డీహైడ్రేషన్‌ అని టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండమంటారు. టీ తాగనిదే పని ముందుకెళ్లదు కొందరికి! మరి అలాంటి వాళ్ల పరిస్థితేంటి? వీటిని ప్రయత్నిస్తే సరి!

హైబిస్కస్‌ టీ.. వేడి తాపం నుంచి రక్షించడంలో ఈ టీ ముందుంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు నెలసరి సమయంలో నొప్పినీ, ఆందోళననీ దూరం చేస్తాయి.


రోజ్‌ టీ.. ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. త్వరిత శక్తినిస్తుందిది. రోగనిరోధకతనీ పెంచుతుంది. నరాలను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలనూ దూరం చేస్తుంది. వేడిగా కంటే చల్లగా రుచి ఇంకా బాగుంటుంది.


గ్రీన్‌ టీ.. బరువును అదుపులో ఉంచడంలోనూ, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలోనూ సాయపడుతుంది. దీనిలోని గుణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. తక్కువ మోతాదులో ఉండే కెఫిన్‌ మెదడును ఉత్తేజపరుస్తుంది. యాంటీ ఏజెంగ్‌గా కూడా పనిచేస్తుంది. ఇ, బి12 విటమిన్లు చర్మ ఆరోగ్యానికి సాయపడతాయి. చల్లగా, వేడిగా ఎలా తీసుకున్నా మంచిదే!


తులసి టీ.. రోగనిరోధకతను పెంచే గుణాలు దీనిలో ఎక్కువ. ఇన్ఫెక్షన్ల బారి నుంచీ రక్షిస్తుంది. అయితే పుదీనా, రోజ్‌, నిమ్మ వంటి వాటితో కలిపి తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గించడంలో సాయపడుతుంది. త్వరితగతిన శక్తినిస్తూనే ఒత్తిడినీ దూరం చేస్తుంది. దీనిలో జీర్ణప్రక్రియను వేగవంతం చేసే గుణాలూ ఎక్కువే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని