వడదెబ్బ తగలకుండా..

ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బతగిలే ప్రమాదం ఉంది . కాబట్టి.. మనం తీసుకునే ఆహారం, వేసుకొనే దుస్తులపైనా దృష్టి పెట్టాలి..

Published : 02 Apr 2023 00:26 IST

ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బతగిలే ప్రమాదం ఉంది . కాబట్టి.. మనం తీసుకునే ఆహారం, వేసుకొనే దుస్తులపైనా దృష్టి పెట్టాలి..

* ఎండ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవటమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలూ తలెత్తుతాయి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి.

* చెమటను పీల్చేందుకు, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తేలికపాటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి. వ్యాయామం లాంటివి ఉదయం తొమ్మిది గంటల్లోపు సాయంత్రం అయిదు తర్వాత చేయడం మంచిది.

* ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. వేపుళ్లు, ఎక్కువ మసాలా వేసిన మాంసాహారాలు కాకుండా, ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పండ్లకు ప్రాధాన్యమివ్వాలి.

* బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్‌ బాటిల్‌, గ్లూకోజ్‌ను అందుబాటులో ఉంచుకోండి. కళ్లను యూవీ కిరణాల నుంచి కాపాడుకునేందుకు సన్‌గ్లాసెస్‌ను తప్పకుండా ఉపయోగించండి. తలకు ఎక్కువ వేడి తగలకుండా స్కార్ఫ్‌ని కట్టుకోండి. ఎస్‌పీఎఫ్‌ ఉన్న క్రీముల్ని రాసుకున్నాకే బయటకు వెళ్లండి.

* కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల నీరంతా పోయి శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. కాబట్టి వేసవిలో వాటిని చాలా వరకు తగ్గిస్తేనే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్