మొదలుపెడదామా సులువుగా!

క్షణం తీరికలేని జీవితం... మారిన జీవనశైలితో మన చుట్టూ అనారోగ్యాల ముప్పు కాచుకుని కూర్చుంది. వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ చెప్పే మార్గం వ్యాయామం. మనసు శ్రమ చేద్దామన్నా...శరీరం అన్నిసార్లూ మాట వినదు.

Published : 08 May 2023 00:15 IST

క్షణం తీరికలేని జీవితం... మారిన జీవనశైలితో మన చుట్టూ అనారోగ్యాల ముప్పు కాచుకుని కూర్చుంది. వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ చెప్పే మార్గం వ్యాయామం. మనసు శ్రమ చేద్దామన్నా...శరీరం అన్నిసార్లూ మాట వినదు. దాంతో ఆదిలో ఆపేస్తాం. ఇలా కాకూడదంటే...

* వ్యాయామం చేయాలన్న ఉత్సాహం మంచిదే కానీ... మొదలుపెట్టినరోజే గంటసేపు ఆగకుండా పరుగుతీయడమో, నడవడమో చేయొద్దు. ముందు మీ శరీరానికి వ్యాయామం అలవాటు చేయండి. ఇందుకోసం ఓ వారం, పదిరోజులు దగ్గర్లోని పార్కుకెళ్లి కూర్చోండి. చిన్నా, పెద్దా తేడాలేకుండా.. ఎవరికితోచినట్లు వాళ్లు శారీరక శ్రమ చేస్తుంటారు. అది చాలు.. మీలో ఉత్సాహం పెరగడానికి.

* వ్యాయామ మార్గాన్ని ఉత్సాహంగా ఎంచుకోవాలన్నా లేక మొదలుపెట్టిన దానిని కొనసాగించాలన్నా శరీరానికి తగిన శక్తి అవసరం. అందుకే ఆరోగ్య ఆహారం, వేళకి నిద్రపైనా దృష్టిపెట్టండి. ముఖ్యంగా ప్రొటీన్‌, క్యాల్షియం వంటివి శరీరానికి అందేలా డైట్‌ప్లాన్‌ చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది.

* చాలామంది కఠిన వ్యాయామల్ని ఊహించుకుని బరువులెత్తేయాలనో, లేదా ఆగకుండా మైళ్లు పరుగెత్తాలనో అనుకుంటారు. మొదటే ఇలాంటివి ఎంచుకుంటే అలవాటు లేక అనాసక్తి ఏర్పడుతుంది. నడకతో ప్రయాణం మొదలుపెట్టి.. ముందుకు సాగిపోండి. క్రమంగా తాడాట, యోగా, బరువులెత్తడం వంటి ఒక్కోటీ చేర్చుకుంటూ వెళ్లండి. కాస్త హుషారుని పెంచే జుంబా, స్విమ్మింగ్‌ వంటివీ ఉండేట్లు చూసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చు. మీకూ సరదాగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్