నీళ్ల సీసాతో జర జాగ్రత్త!

ఆరోగ్యంపై జాగ్రత్త, సామాజిక అవగాహన కారణం ఏదైతేనేం.... ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వెంట ఓ నీళ్లసీసాను తీసుకెళ్తున్నారు.

Published : 20 May 2023 00:09 IST

ఆరోగ్యంపై జాగ్రత్త, సామాజిక అవగాహన కారణం ఏదైతేనేం.... ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వెంట ఓ నీళ్లసీసాను తీసుకెళ్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా... దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం అనారోగ్యాలు తప్పవు. అసలు ఎలాంటివి వాడాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? చూద్దామా?

తక్కువ ధరకే దొరుకుతాయి. చూడ్డానికీ బాగుంటాయి అనే కారణంతో చాలామంది ప్లాస్టిక్‌ సీసాలను వాడుతుంటారు. కానీ వీటిని దీర్ఘకాలం వాడటం తీవ్ర అనారోగ్యాలకు దారి తీయొచ్చు. మరీ ముఖ్యంగా వీటిల్లో వేడినీటిని నింపడం అస్సలు మంచిది కాదు. గాజు, రాగి, స్టీల్‌ సీసాలను ఎంచుకోండి.

ఏ రకం సీసాల్లో నీళ్లు పట్టినా... సరే! అందులో ఎక్కువ సమయం నిల్వ ఉంచొద్దు. ఏ రోజుకా రోజూ శుభ్రం చేశాకే... వాటిని వాడాలి.

నీళ్ల బాటిళ్లను కాస్త ఉప్పు, బేకింగ్‌ సోడా, గోరువెచ్చటి నీళ్లల్లో వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దుర్వాసన దూరం అవుతుంది. ఫంగస్‌ వంటివీ దరిచేరవు. అప్పుడప్పుడూ వెనిగర్‌తోనూ శుభ్రం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్