చిగుళ్లకి.. లవంగాలు!

చిగుళ్ల నొప్పి, వాపు తరచూ వేధిస్తున్నాయా? పోషకాహార లోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఔషధాల దుష్ప్రభావాలు వంటివి ఈ సమస్యకు కారణం కావొచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్లకూడా ఇలా జరుగుతుంది.

Updated : 06 Jun 2023 11:37 IST

చిగుళ్ల నొప్పి, వాపు తరచూ వేధిస్తున్నాయా? పోషకాహార లోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఔషధాల దుష్ప్రభావాలు వంటివి ఈ సమస్యకు కారణం కావొచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్లకూడా ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనానికి ఇంటిలో దొరికే వాటితోనూ ప్రయత్నించవచ్చు... 

* ఉప్పు నీటితో: గోరువెచ్చని నీటిలో కొద్దిగా కళ్లుప్పు వేసి రోజుకు రెండు నుంచి ఐదుసార్లు పుక్కిలిస్తే ఫలితం ఉంటుంది.

* పసుపుతో: పావుచెంచా పసుపులో కాస్త కళ్లుప్పుని తీసుకుని బాగా నూరి ఈ మిశ్రమాన్ని వాపు, నొప్పి ఉన్న చోట మర్దనా చేసి.. వేడి నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పి తగ్గుతుంది.

* నల్ల మిరియాలతో: ఐదారు నల్లమిరియాలు తీసుకుని మెత్తగా పొడి చేయాలి. దీనిలో రెండు చుక్కల ఆవనూనె కలిపి చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేస్తే ఉపశమనం కలుగుతుంది.

* లవంగం పూత: ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. నాలుగు లవంగాలను తీసుకుని పొడిచేసి దూదితో నొప్పి ఉన్న చోట అద్దాలి. తర్వాత వేడి నీటితో కడిగేస్తే సరి.

* ఉసిరితో: దీనిలో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. గ్లాసు నీటిలో చెంచా ఉసిరిపొడి వేసుకుని తాగితే చిగురు వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్