అనారోగ్యాలకు దూరంగా..

పిల్లలకు స్కూళ్లు తెరిచేస్తున్నారు! ఉదయాన్నే కొద్దిసేపు బద్ధపద్మాసనం వేసేలా చూడండి. శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆరోగ్యవంతులు అవుతారు.'

Published : 10 Jun 2023 00:04 IST

పిల్లలకు స్కూళ్లు తెరిచేస్తున్నారు! ఉదయాన్నే కొద్దిసేపు బద్ధపద్మాసనం వేసేలా చూడండి. శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆరోగ్యవంతులు అవుతారు.'

ఇలా చేయాలి..  ముందుగా కుడికాలిని ఎడమ తొడ మీద, ఎడమ కాలిని కుడి తొడ మీద ఉంచి పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులూ వెనక్కి తీసుకుని వాటిని క్రాస్‌ చేసి కుడి చేత్తో ఎడమకాలి బొటన వేలును, ఎడమ చేత్తో కుడి కాలి బొటన వేలును పట్టుకోవాలి. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. నెమ్మదిగా చేతులను వదిలి ముందుకు తెచ్చి అంతే నెమ్మదిగా పద్మాసనం లోంచి యథాస్థితిలోకి రావాలి.

ఇవీ ప్రయోజనాలు... బద్ధపద్మాసనం అందరికీ మంచిది. పిల్లలకు చాలా అవసరం. దీని వల్ల... దేని మీదా శ్రద్ధ లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చెప్పిన మాట వినకపోవడం- లాంటివన్నీ తగ్గుతాయి. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. చదివిన అంశాలు మెదడుకు ఎక్కుతాయి, గుర్తుంటాయి. ఆలోచనాశక్తి పెరుగుతుంది. భుజాలు, గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరి తిత్తులు, ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. హృద్రోగాలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది. మలబద్ధక సమస్యకు తావుండదు. శరీరం ఉక్కులా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జాగ్రత్తలు... ఆసనం మొదలుపెట్టగానే చేతులకు కాళ్ల బొటనవేళ్లు అందకపోవచ్చు. ఊబకాయం ఉన్నవాళ్లకి, నడుము, పొట్ట దగ్గర కొవ్వు చేరి ఇబ్బంది పడుతున్నవాళ్లకీ ఇబ్బందే. చేతులను సాగదీసినట్లు కాళ్ల దగ్గరికి చేర్చడం చేస్తే సరి. ముందు కాస్త కష్టమనిపించినా, మెల్ల మెల్లగా చేస్తుంటే తేలిగ్గా, సదుపాయంగానే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్