చల్లగా... బరువు తగ్గుదాం!

బరువు తగ్గడానికి ఉదయాన్నే చాలామందికి వేడినీళ్లు తాగటం అలవాటు. కానీ ఈ వేసవిలో వేడినీళ్లు తాగాలంటే కష్టంగా ఉంటుంది. మరి బరువు తగ్గేదెలా అంటారా! అటు చల్లగా ఉంటూ బరువు తగ్గించే పానీయాలు సిద్ధం చేసుకుంటే సరి.

Updated : 10 Jun 2023 09:33 IST

బరువు తగ్గడానికి ఉదయాన్నే చాలామందికి వేడినీళ్లు తాగటం అలవాటు. కానీ ఈ వేసవిలో వేడినీళ్లు తాగాలంటే కష్టంగా ఉంటుంది. మరి బరువు తగ్గేదెలా అంటారా! అటు చల్లగా ఉంటూ బరువు తగ్గించే పానీయాలు సిద్ధం చేసుకుంటే సరి. అవేంటంటారా!

కీరదోసతో.. కీరదోస తొక్కతీసి ముక్కలు చేయండి. వీటిని ఒక బాటిల్‌ నీళ్లలో వేసి గంటసేపు ఉండనివ్వండి. ఆ నీటిని ఉదయాన్నే తీసుకుంటే సరి. కీరదోసలో నీటి శాతం అధికం. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

మజ్జిగ.. ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే చలువ చేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగ వట్టిగా అలానే తీసుకోలేకపోతే అందులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వంటివి కలిపి తాగొచ్చు.

మెంతులతో.. రెండు స్పూన్ల మెంతులను నీళ్లలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడపోసి పరగడుపున తాగేయండి. ఇది అధికంగా పేరుకున్న కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. శరీరం పోషకాలను సరిగా గ్రహించుకునేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్