పోషకాల పప్పులు!

ఎన్ని రుచులున్నా పప్పుతో చేసిన వంటకాల ప్రత్యేకతే వేరు. అయినా సరే! పప్పేనా అంటూ చిన్నచూపు చూస్తుంటాం. కానీ, వీటిల్లోని పోషకాల గురించి తెలిస్తే మాత్రం ఔరా అనక మానం.

Published : 12 Jun 2023 00:22 IST

ఎన్ని రుచులున్నా పప్పుతో చేసిన వంటకాల ప్రత్యేకతే వేరు. అయినా సరే! పప్పేనా అంటూ చిన్నచూపు చూస్తుంటాం. కానీ, వీటిల్లోని పోషకాల గురించి తెలిస్తే మాత్రం ఔరా అనక మానం. అవేంటో తెలుసుకుందామా!

* కందిపప్పు... ముద్దపప్పు, మామిడికాయపప్పు, సాంబారు... ఇలా ఏరకం వంటకానికైనా చక్కటి రుచి తెస్తుంది కందిపప్పు. దీన్ని కాస్త దోరగా వేయించి వండితే సరి. ఈ పప్పులో దొరికే ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు అవసరమైన కీలక విటమిన్‌. ముఖ్యంగా గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు, ఆరోగ్యానికీ ఇది ఎంతో అవసరం. ఈ పప్పుని రోజూ తినడం వల్ల మేలు చేసే ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బో హైడ్రేట్‌లూ శరీరానికి అందుతాయి. తక్షణ శక్తినీ అందిస్తాయి. కొన్ని రకాల గుండె వ్యాధులనూ, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌నూ అదుపులో ఉంచే శక్తి దీనికి ఉందంటున్నాయి అధ్యయనాలు.

* పెసరపప్పు... స్వీటే చేయాలన్నా, దోశ వేసుకోవాలన్నా... చారే పెట్టుకోవాలన్నా పెసరపప్పుని మించింది లేదు. ఇందులో అధిక మోతాదులో ఫైబర్‌, తక్కువ మొత్తంలో కెలోరీలు లభిస్తాయి. అలానే, దీనిలో ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలూ తగినన్ని లభిస్తాయి. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. 

* సెనగపప్పు... తాలింపుల్లో, పచ్చళ్లల్లోనూ ఎక్కువగా వాడే ఈ పప్పు శాకాహారులకు చక్కని ప్రొటీన్‌ ఆధారం. అలానే కాపర్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది మధుమేహాన్నీ అదుపులో ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్