చినుకులతో చుండ్రు పెరగకుండా...

వర్షాకాలంలో వాతావరణంలోని చెమ్మ, తేమ మాడుపై ఉత్పత్తి అయ్యే సహజనూనె సమన్వయాన్ని భంగపరుస్తుంది. మాడును జిడ్డుగా మార్చి . మృతకణాలను పెంచి చుండ్రుకు దారితీసేలా చేస్తుంది.

Published : 20 Jul 2023 00:01 IST

వర్షాకాలంలో వాతావరణంలోని చెమ్మ, తేమ మాడుపై ఉత్పత్తి అయ్యే సహజనూనె సమన్వయాన్ని భంగపరుస్తుంది. మాడును జిడ్డుగా మార్చి . మృతకణాలను పెంచి చుండ్రుకు దారితీసేలా చేస్తుంది. పరిష్కారమేంటో చూద్దాం..

సీజన్‌లో తలస్నానం చేసిన మరుసటి రోజుకే మాడు జిడ్డుగా మారుతుంది. శిరోజాల చివర్లు చిట్లుతాయి. అలాకాకుండా ఉండాలంటే వారానికి కనీసం మూడు నుంచి నాలుగుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నీళ్లు బాగా వేడిగా ఉంటే మాడుపై సహజనూనెలు దూరమై వెంట్రుకలు పొడిబారతాయి. తలా దురదపెడుతుంది.

తలస్నానం చేసేటప్పుడు షాంపూ వ్యర్థాలూ, మృతకణాలు, చుండ్రు వంటివి తల్లో పేరుకోకుండా దువ్వెన లేదా బ్రష్‌తో రుద్దితే సరి. ఇవి తొలగిపోతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

 చినుకులకు తడిచినప్పుడు పూర్తిగా ఆరనివ్వండి. మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయండి. తర్వాత కుదుళ్ల నుంచి చివర్ల వరకూ కండిషనర్‌ రాయడం మరిచిపోవద్దు. అప్పుడే శిరోజాలు పొడారకుండా తేమ సమన్వయం చేస్తుంది. అలానే, మాడుపై జిడ్డును పెంచే జెల్‌, వ్యాక్స్‌ వంటివి ఈ కాలంలో వినియోగించకపోవడమే మంచిది.

 కురులు ఆరోగ్యంగా ఉండాలంటే పై పూతల అవసరంతో పాటు పోషకాహారమూ తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు ఎండుగడ్డిలా మారకుండా  సరిపడా నీటిని తాగాలి.

 శిరోజాల చివర్లు చిట్లినట్లు ఉంటే తరచూ ట్రిమ్మింగ్‌ చేసుకోవడం మంచిది. లేదంటే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాగే తలస్నానం చేసిన తర్వాత డ్రయ్యర్‌ వినియోగించకుండా సహజంగా ఆరనివ్వాలి. స్ట్రెయిటనర్‌, కర్లర్ల వాడకం తగ్గించాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

 తడి జట్టుతో ముడులు వేయడం,  జడలు అల్లడం వంటివి చేయకండి. ఇది తల్లో వాసనకు కారణమవుతుంది. ఫంగస్‌ చేరి చుండ్రు ఇబ్బంది పెడుతుంది. ఇక, అలానే బయటకు వెళ్తే వాతావరణంలోని దుమ్ము, ధూళి జుట్టుపైకి తేలికగా చేరతాయి. ఇన్ఫెక్షన్లూ చుట్టుముడతాయి. మరొకరి దువ్వెన, హెయిర్‌బ్రష్‌, యాక్ససరీస్‌ వంటివి వినియోగించకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్